జగన్ పై దాడి కేసులో కొత్త ట్విస్ట్

వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో ఆధారాలు ఎన్ ఐఏకు ఇచ్చేందుకు ఏపీ సిట్ పోలీసులు నిరాకరించారు.

  • Publish Date - January 17, 2019 / 12:30 PM IST

వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో ఆధారాలు ఎన్ ఐఏకు ఇచ్చేందుకు ఏపీ సిట్ పోలీసులు నిరాకరించారు.

విజయవాడ : వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆధారాలు ఎన్ ఐఏకు ఇచ్చేందుకు ఏపీ సిట్ పోలీసులు నిరాకరించారు. జగన్ పై దాడి కేసుకు సంబంధించిన ఆధారాలను ఎన్ ఐఏ కోరగా ఇచ్చేందుకు ఏపీ సిట్ పోలీసులు నిరాకరించారు. ఎన్ ఐఏ విచారణకు రాష్ట్ర పోలీసులు సహకరించడం లేదని ఎన్ ఐఏ అధికారులు కోర్టును ఆశ్రయించారు. సిట్ పోలీసుల తీరుపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ ఐఏ అధికారులు వేసిన పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి.

జగన్ పై కోడి కత్తి దాడి ఏపీలో సంచలనం కలిగించింది. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీనిన్ వాస్ అనే వ్యక్తి  కోడి పందేల కత్తితో దాడి చేశాడు. దీంతో జగన్ భుజంపై తీవ్రగాయమైంది. జగన్ పై దాడి కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ ఐఏకు అప్పగించింది. ఈ కేసును ఎన్ ఐఏకు అప్పగించడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తప్పుబట్టారు. కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.