Nitish Kumar: నాకున్నది ఆ ఒక్క ఆశ మాత్రమే.. కేసీఆర్ మీటింగ్ మరుసటి రోజు నితీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

వాస్తవానికి ఇరు నేతలు జాతీయ స్థాయిలో పెద్ద పదవి మీదే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ విషయమై కేసీఆర్ అయితే పెద్దగా స్పందించలేదు. కానీ నితీశ్ మాత్రం పలు సందర్భాల్లో ప్రస్తావించారు. నితీశ్‭ను సమర్ధించేవారు ఆయనను ప్రధానమంత్రి అభ్యర్థని ప్రచారం చేస్తుండగా, ఆయన మాత్రం తనకు అలాంటి ఆశ లేదని చెప్పుకుంటూ వస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కాకుండా దేశంలోని స్థానిక పార్టీలతో కూటమికి నితీశ్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు

Nitish Kumar: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన అనంతరం జనవరి 18న మొదటిసారి జాతీయ స్థాయి మీటింగ్ నిర్వహించారు. దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని ఊవిళ్లూరుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. దేశంలోని విపక్షాల్ని ఏకం చేసే లక్ష్యంతో పలు విపక్ష నేతల్ని ఆహ్వానించి భారీ సభే నిర్వహించారు. కాగా, ఈ మీటింగ్ జరిగిన మర్నాడు దేశంలో విపక్ష కూటమి కోసం ప్రయత్నిస్తున్న మరో నేత బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆసక్తికరంగా స్పందించారు. తనకు ఏ పదవీ అక్కర్లేదని, విపక్షాలన్నీ ఏకమై కేంద్రంలో అధికారం సాధించడమే తనకున్న ఏకైక కోరికని నితీశ్ అన్నారు.

Wrestlers Protest: ‘ముందు స్టేజీ దిగండి’.. రెజ్లర్ల నిరసనలో బృందా కారత్ సహా లెఫ్ట్ నేతలకు చేదు అనుభవం

వాస్తవానికి ఇరు నేతలు జాతీయ స్థాయిలో పెద్ద పదవి మీదే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ విషయమై కేసీఆర్ అయితే పెద్దగా స్పందించలేదు. కానీ నితీశ్ మాత్రం పలు సందర్భాల్లో ప్రస్తావించారు. నితీశ్‭ను సమర్ధించేవారు ఆయనను ప్రధానమంత్రి అభ్యర్థని ప్రచారం చేస్తుండగా, ఆయన మాత్రం తనకు అలాంటి ఆశ లేదని చెప్పుకుంటూ వస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కాకుండా దేశంలోని స్థానిక పార్టీలతో కూటమికి నితీశ్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అయితే ఇదే తరహాలో ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Sajjanar: అధిక డబ్బుకు ఆశపడితే అంతే.. అలాంటి సంస్థల వలలో చిక్కుకోవద్దని హెచ్చరించిన సజ్జనర్

ఈ సందర్భంగా, కేసీఆర్ మీటింగ్ గురించి నితీశ్ వద్ద ప్రస్తావించగా.. ‘‘నేనీ విషయం చాలాసార్లు చెప్పాను. నాకంటూ ఏమీ అక్కర్లేదు. దేశంలోని విపక్ష నేతలంతా ఒకతాటిపైకి వచ్చి బలమైన కూటమిగా ఏర్పడాలి. ఇలా అయితే అది దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే నాకున్న ఏకైక కోరిక’’ అని అన్నారు. బుధవారం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ విపక్ష నేత అఖిలేష్ యాదవ్ సహా సీపీఐ(ఎం) నేత డీ.రాజా హాజరయ్యారు.

ట్రెండింగ్ వార్తలు