ఆర్టీసీలో ప్రైవేటుకు నో ఛాన్స్ : యూనియన్ ఉండదు – సీఎం కేసీఆర్ 

  • Publish Date - December 1, 2019 / 01:23 PM IST

ఆర్టీసీ సంస్థలో ఇక యూనియన్ ఉండదని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఆర్టీసీ సంస్థ మనుగడ కోసం ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఒక రెండు సంవత్సరాలు యూనియన్ లేకుండా పెట్టుకుందాం..మంచిగా ఉంటే..ఇదే కంటిన్యూ చేద్దాం..రాకపోతే..యూనియన్ ‌లోకి వెళుదామన్నారు కేసీఆర్. ఎంప్లాయిస్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసుకుని ప్రతి డిపోకు ఇద్దరు కార్మికులు ఉండే విధంగా చూసుకోవాలని..రాష్ట్ర స్థాయిలో ఓ వ్యక్తి ఉండి.. సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

అంతేగాకుండా..ఆర్టీసీ బస్సులను సరుకు రవాణాకు కూడా ఉపయోగించి లాభాల బాటల్లోకి తీసుకరావాలన్నారు. ప్రైవేటుకు ఒక్క ఆర్టీసీ బస్సును ఇవ్వమని తేల్చిచెప్పారు. పనిమాత్రం చేసి చూపించాలన్నారు. 

> ప్రతి ఏడాది బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ. వేయ్యి కోట్లు ఇస్తామన్నారు. 
> ఆర్టీసీలో బస్ ఛార్జీలు మినిమం రూ. 10లు ఉంటాయి. 
> చీటిమాటికి సమ్మెలోకి వెళ్లవద్దు. 
> ఆర్టీసీ డిపోల్లో మహిళలకు ప్రత్యేక వసతులు.
> సెప్టెంబర్ నెల జీతం నవంబర్ 02వ తేదీ సోమవారం చెల్లింపు.
> లాభాల్లోకి తీసుకొస్తే సింగరేణి తరహా బోనస్‌లు.
> 52 రోజుల సమ్మె కాలానికి వేతనాలు.
> రాత్రి వేళల్లో మహిళలకు డ్యూటీలు వద్దు.
> హైదరాబాద్‌లో అధికంగా నష్టం వస్తోంది. 
బస్‌ రూట్ల విషయంలో…డిపో ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాలి. 
ప్యాసింజర్లను ఎక్కించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. 
దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల కోసం కాలనీల్లో బస్సులు నిలపాలి. 
Read More : మహిళా కండక్టర్లకు నైట్ డ్యూటీలు వద్దు – కేసీఆర్