Opposition March: అదానీని వదలని విపక్షాలు.. హైడ్రామా నడుమ ఢిల్లీలో ఎంపీల ర్యాలీ

ప్రజల నుంచి వాస్తవాల్ని దాచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. వెనుకబడిన వర్గాలను అవమానించారని ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు. దేశాన్ని దోచుకున్నవారు వెనుకబడిన వర్గాలా? వీటికి మోదీ సమాధానం చెప్పాలిం. అదానీ వ్యవహరంపై ప్రధాని ఎందుకు నోరు తెరవడం లేదు? ఎందుకు జేపీసీ ఏర్పాటు చేయడం లేదు? దీనిపై వెంటనే జేపీసీ ఏర్పాటు చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం

Opposition March: అదానీ గ్రూప్ వ్యవహారంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో విపక్ష పార్టీల ఎంపీలు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రపతి భవన్‭కు ర్యాలీ చేపట్టిన ఎంపీలను విజయ్ చౌక్ వద్ద పోలీసులు ఆపారు. దీంతో అక్కడే బైటాయించి ఆందోళన చేపట్టారు. కాగా, ఈ ర్యాలీని ఉద్దేశించి కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ దేశాన్ని దోచుకున్న వారి గురించి మోడీ మాట్లాడటం లేదని మండిపడ్డారు. అదానికి సంపద సృష్టించుకోవడానికి మోడీ సహకరించారని ఆరోపించిన ఆయన ఈ వ్యవహారం పై జెపిసి వేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఆందోళనకు దిగిన ఎంపీలను పోలీసులు నిర్బంధించారు.

Ap Assembly : వైసీపీకి ఝలక్ ఇచ్చిన ‘ఆ నలుగురు’.. ఇద్దరు అనుమానిత ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజరు.. టీడీపీకి ఓటు వేసింది వీరేనా?!

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ప్రజల నుంచి వాస్తవాల్ని దాచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. వెనుకబడిన వర్గాలను అవమానించారని ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు. దేశాన్ని దోచుకున్నవారు వెనుకబడిన వర్గాలా? వీటికి మోదీ సమాధానం చెప్పాలిం. అదానీ వ్యవహరంపై ప్రధాని ఎందుకు నోరు తెరవడం లేదు? ఎందుకు జేపీసీ ఏర్పాటు చేయడం లేదు? దీనిపై వెంటనే జేపీసీ ఏర్పాటు చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం’’ అని ఖర్గే అన్నారు. విపక్షాలు చేపట్టిన ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. 144 సెక్షన్ అమల్లోకి తెచ్చి భారీగా బలగాలను మోహరించారు.

ట్రెండింగ్ వార్తలు