Ap Assembly : వైసీపీకి ఝలక్ ఇచ్చిన ‘ఆ నలుగురు’.. ఇద్దరు అనుమానిత ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజరు.. టీడీపీకి ఓటు వేసింది వీరేనా?!

ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరూ అనుమానిత ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మాకొట్టారు. టీడీపీకి ఓటు వేసిన వైసీపీకి చెందిన ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరిపై అందరికి క్లారిటీ ఉంది..కానీ మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరా?అనేది అందరికి ఆసక్తికరంగా మారిన క్రమంలో ఇద్దరు అనుమానిత ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. దీంతో ఆ ఇద్దరు ఎవరు?అనేది..

Ap Assembly : వైసీపీకి ఝలక్ ఇచ్చిన ‘ఆ నలుగురు’.. ఇద్దరు అనుమానిత ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజరు.. టీడీపీకి ఓటు వేసింది వీరేనా?!

Ap Assembly Two ycP MLAs assembly absences .

AP Assembly : ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరూ అనుమానిత ఎమ్మెల్యేలు శుక్రవారం అసెంబ్లీ కి డుమ్మాకొట్టారు. టీడీపీకి ఓటు వేసిన వైసీపీకి చెందిన ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరిపై అందరికి క్లారిటీ ఉంది..కానీ మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరా?అనేది అందరికి ఆసక్తికరంగా మారిన క్రమంలో ఇద్దరు అనుమానిత ఎమ్మెల్యేలు (మార్చి24,2023) అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. దీంతో ఆ ఇద్దరు ఎవరు?అనేది తేలిపోయినట్లుగా తెలుస్తోంది.

కోటం,ఆనం ఓట్లపై క్లారిటీ.. మరో ఆ ఇద్దరిపైనే అనుమానాలు..
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓట్ వేశారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. క్రాస్ ఓటింగ్ వల్లే ఒక స్థానంలో ఓటమిపాలయ్యామని వైసీపీ చెబుతోంది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వారిని గుర్తిస్తామని, వారిపై చర్యలు తీసుకుంటామని వైసీపీ చెబుతోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీకే ఓటు వేస్తారనే క్లారిటీ అందరికి ఉంది. కానీ మరో రెండు ఓట్లు వేసిన వారిపై కారాలు మిరియాలు నూరుతోంది వైసీపీ అధిష్టానం. వారిద్దరిపై వేటు వేస్తారా? లేదా? అనేది హాట్ టాపిక్ గా మారిన క్రమంలో నిన్న ఎన్నికలు పోలింగ్ పూర్తి అయ్యాక వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ నేను మాత్రం క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని శ్రీదేవి చెబుతున్నారు. కానీ వైసీపీ అధిష్టానం మాత్రం నమ్మటంలేదు.

MLA Undavalli Sridevi : ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కలకలం.. ఆ ఆరోపణలపై ఎమ్మెల్యే శ్రీదేవి క్లారిటీ

ఇకపోతే నాలుగో ఓటు వేసింది ఎవరు? అంటే వినిపించే పేరు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి (Mekapati Chandra Sekhar Reddy). నిన్న ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యాక మేకపాటి బెంగళూరు వెళ్లిపోయారు. టీడీపీ తరపును 23 ఓట్లతో పంచుమర్తి అనూరాధ గెలుపు ఖాయం అయ్యాక మేకపాటిపై అనుమానం వ్యక్తంచేసిన వైసీపీ మేకపాటికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో టీడీపీకి ఓటు వేసిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేకర్ రెడ్డి అని క్లారిటీకి వచ్చింది వైసీపీ. శ్రీదేవి,మేకపాటి ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టటంతో దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చినట్లైంది వైసీపీకి.. ఈక్రమంలో వీరిద్దరిపై చర్యలు తీసుకోవటానికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది.

కాగా.. ఆంధ్రప్రదేశ్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైసీపీకి దెబ్బ గట్టిగా తగిలింది. మూడు స్థానాలు టీడీపీయే గెలుచుకుంది. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై అప్రమత్తమైన వైసీపీకి మరోసారి సొంతపార్టీ ఎమ్మెల్యేలే దెబ్బకొట్టారు. టీడీపీలో గెలిచి వైసీపీలోకి కొంతమంది ఎమ్మెల్యేలు జంప్ అవ్వటంతో టీడీపీ నుంచి ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్యీ ఎన్నికల్లో ఒక్క టీడీపీ అభ్యర్థి కూడా గెలవకూడదనే ప్లాన్ వేసింది వైసీపీ.

ఎందుకంటే టీడీపి నుంచి గెలిచి వైసీపీలోకి నలుగురు ఎమ్మెల్యేలు జంప్ అవ్వటంతో టీడీపీకి కేవలం 19 స్థానాల బలమే ఉంది. కానీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవాలంటే 23 ఓట్లు కావాలి. కానీ టీడీపీకి వైసీపీ నుంచి నలుగురు ఓట్లు వేయటంతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) విజయం సాధించారు. దీంతో వైసీపీకి ఝలక్ ఇచ్చిన ఆ నలుగురు ఎమ్మెల్యేలపై ముఖ్యంగా ఇద్దరు ఎమ్మెల్యేలపై వైసీపీ తీవ్ర ఆగ్రహంగా ఉంది. కోటంరెడ్డి, ఆనం ఎలాగూ టీడీపీకే ఓటు వేస్తారని నమ్మిన వైసీపీ మరో రెండు ఓట్లు టీడీపీకి పడతాయన బహుశా ఊహించి ఉండదు. కానీ జరిగింది. టీడీపీ నిలబెట్టిన ఒక్క అభ్యర్థి గెలుపు సాధించటంతో వైసీపీకి మింగుడుపడటంలేదు.
TDP 23 Number : డేట్ 23, ఎమ్మెల్యేలు 23, ఓట్లు 23.. నెగిటివ్ నెంబర్‌ను లక్కీ నెంబర్‌గా మార్చుకున్న టీడీపీ

క్రాస్ ఓట్ చేయలేదంటున్న ఉండవల్లి శ్రీదేవి..
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (Vundavalli Sridevi) మాత్రం తాను క్రాస్ ఓట్ చేయలేదని.. ఓటు వేసే ముందు తాను జగన్‌ను కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. తాను పార్టీ లైన్ దాటలేదని.. తనకు ఇచ్చిన కోడ్ ప్రకారమే ఓటు వేసానని చెబుతున్నారు.త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని ధీమా వ్యక్తంచేస్తున్నారు శ్రీదేవి.

ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..
అసెంబ్లీ రాకుండా డుమ్మా కొట్టిన మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి అందుబాటులోనే లేకుండాపోయారు. ఓటు వేశాక మేకపాటి డైరెక్ట్ గా బెంగళూరు వెళ్లారనే ప్రచారం జరుగుతోంది.. ఆయన ఎవరికీ అందుబాటులోకి రాలేదు.

Chandrababu : వచ్చే ఎలక్షన్స్ జగన్ పర్సెస్ పబ్లిక్.. ఇక ఏ ఎన్నికల్లోనూ గెలవడు : చంద్రబాబు