TDP 23 Number : డేట్ 23, ఎమ్మెల్యేలు 23, ఓట్లు 23.. నెగిటివ్ నెంబర్‌ను లక్కీ నెంబర్‌గా మార్చుకున్న టీడీపీ

ఈ రోజు 23వ తేదీ.. 23మంది ఎమ్మెల్యేలు.. 23 ఓట్లతో విజయం.. నెగిటివ్ నెంబర్ ను లక్కీ నెంబర్ గా మార్చుకుంది టీడీపీ.(TDP 23 Number)

TDP 23 Number : డేట్ 23, ఎమ్మెల్యేలు 23, ఓట్లు 23.. నెగిటివ్ నెంబర్‌ను లక్కీ నెంబర్‌గా మార్చుకున్న టీడీపీ

TDP 23 Number : ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా 3 స్థానాల్లో విజయం సాధించి అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. అది మరువకముందే మరోసారి తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఏడుగురు అభ్యర్థులు గెలిచేందుకు అవసరమైన ఎమ్మెల్యేల బలం వైసీపీకి ఉన్నప్పటికీ.. టీడీపీ అభ్యర్థి గెలవడంతో వైసీపీ శ్రేణులు షాక్ కి గురయ్యాయి.

Also Read..Chandrababu : వచ్చే ఎలక్షన్స్ జగన్ పర్సెస్ పబ్లిక్.. ఇక ఏ ఎన్నికల్లోనూ గెలవడు : చంద్రబాబు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలన విజయం.. టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపింది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. మంగళగిరి పార్టీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చారు. మెజార్టీకి అవసరమైన ఎమ్మెల్యేల బలం లేకపోయినా.. గెలవడంపై ఫుల్ ఖుషీ అవుతున్నారు.(TDP 23 Number)

Also Read..MLC Election Results 2023 : రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20వేలు చెల్లని ఓట్లు .. వైసీపీకి షాకిచ్చిన గ్రాడ్యుయేట్లు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని అనూహ్య ఫలితం వెలువడింది. టీడీపీ తరపున బరిలోకి దిగిన పంచుమర్తి అనురాధ గెలుపొందారు. 23 ఓట్లు రావడంతో ఆమె ఎమ్మెల్సీగా విజయం సాధించారు. వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.

ఇక, ఈ విజయం టీడీపీకి చాలా చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ఈ రోజు 23వ తేదీ.. 23మంది ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతుగా నిలిచారు.. 23 ఓట్లతో టీడీపీ గెలిచింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. 23 అనేది టీడీపీకి నెగిటివ్ నెంబర్. ఆ నెంబర్ నే టీడీపీ.. ఇప్పుడు లక్కీ నెంబర్ గా మార్చుకుంది అనే అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది.

Also Read..Sajjala Ramakrishna Reddy : ఈ ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం కాదు- ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్‌పై సజ్జల సంచలన వ్యాఖ్యలు

23 సీట్ల పేరుతో అధికార వైసీపీ.. పదే పదే టీడీపీని కార్నర్ చేసిన సంగతి తెలిసిందే. ఛాన్స్ చిక్కితే చాలు.. 2019 ఎన్నికల్లో మీకు వచ్చింది 23 సీట్లే అని, 23 సీట్లకే మీరు పరిమితం అయ్యారని, ఈసారి ఎన్నికల్లో మీకు 23 సీట్లు కూడా రావని టీడీపీపై వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు. 23 నెంబర్ అడ్డుపెట్టుకుని ఎద్దేవా చేశారు.

అయితే, తాజా ఫలితంతో 23 సెంటిమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ బయటపడినట్లు అయ్యింది. ఇప్పుడు అదే 23 నెంబర్.. టీడీపీకి లక్కీ నెంబర్ గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇకపై వైసీపీ నాయకులు 23 సీట్ల పేరుతో విమర్శలు చేసే అవకాశం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. వైసీపీ సెంటిమెంట్ కామెంట్స్ కు అనురాధ గెలుపుతో టీడీపీ చెక్ చెప్పినట్లు అయ్యింది. మరోవైపు 2023 టీడీపీకి కలిసి వచ్చిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. 2023లో టీడీపీకి అనుకూల ఫలితాలు రావడమే ఇందుకు కారణం అంటున్నారు ఆ పార్టీ నేతలు.

Also Read..MLC Election Results 2023 : పవన్ కళ్యాణ్ మాట నిజమైంది.. ఈ ఎన్నికలు శుభపరిణామం.. గంటా శ్రీనివాసరావు

ఇదీ క‌దా దేవుడు స్క్రిప్ట్ అంటే.. జగన్ గారు-లోకేశ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్పందించారు. ”ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా విజ‌యం సాధించిన విజ‌య‌వాడ మాజీ మేయ‌ర్, చేనేత ఆడ‌ప‌డుచు, మా తెలుగుదేశం కుటుంబ‌స‌భ్యురాలు పంచుమ‌ర్తి అనూరాధకి హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. మేము 23 సీట్లే గెలిచామ‌ని ఎద్దేవా చేశావు. అందులో న‌లుగురిని సంత‌లో ప‌శువుల్లా కొన్నావు. చివ‌రికి అదే 23వ తేదీన‌, అదే 23 ఓట్ల‌తో నీ ఓట‌మి-మా గెలుపు. ఇది క‌దా దేవుడు స్క్రిప్ట్ అంటే జగన్ గారు!” అని లోకేశ్ ట్వీట్ చేశారు.(TDP 23 Number)

Also Read..Nandamuri Balakrishna : ”వై నాట్ 175” అని సీఎం జగన్ ఇప్పుడంటే వినాలని ఉంది-బాలకృష్ణ

రాష్ట్రానికి చంద్రబాబు పాలనే అవసరమని వైసీపీ ఎమ్మెల్యేలు గుర్తించారు-కూన రవికుమార్
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ కార్యాలయంలో విజయోత్సవాల్లో మాజీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గుండ లక్ష్మీదేవి పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా అనూరాధకు విజయాన్ని అందించిన సీఎం జగన్ కి ధన్యవాదాలు చెప్పారు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్. జగన్.. ఆత్మ ప్రబోదానుసారం తెలుగు దేశం పార్టీకి విజయం సాధించారని చెప్పారు. టీడీపీకి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసిన జగన్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు.

రాబోయే రోజుల్లో రాష్ట్రానికి చంద్రబాబు పాలనే అవసరమని వైసీపీ నేతలు సైతం గుర్తించారని అన్నారు. ఆత్మ ప్రబోదానుసారం ఓటు వేసిన వైసీపీ ఎమ్మెల్యేలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ”నిన్న పట్టభద్రులు వైసీపీని వ్యతిరేకించారు, ఇప్పుడు సొంత ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకించారు. కాబట్టి జగన్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలి. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలి” అని కూన రవికుమార్ అన్నారు.

గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నే ఓట్లు వచ్చాయి. వాస్తవానికి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు వెళ్లారు. గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ, గుంటూరు వెస్ట్ నుంచి గెలిచిన మద్దాలి గిరి, విశాఖ సౌత్ నుంచి గెలిచిన వాసుపల్లి గణేశ్, చీరాల నుంచి గెలిచిన కరణం బలరాం.. ఈ నలుగురూ టీడీపీ టికెట్ మీద గెలిచి, ఆ తర్వాత రెబెల్స్ గా మారి, వైసీపీకి దగ్గరయ్యారు. అయితే, ఈ నలుగురూ వైసీపీకి ఓటేశారా? ఎవరూ ఊహించనిరీతిలో సొంత పార్టీకే ఓటు వేశారా? అన్నది తేలాల్సి ఉంది. అసెంబ్లీలో టీడీపీకి ఉన్న సీట్ల సంఖ్యే.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనురాధకు వచ్చాయి. అంటే, వాళ్ల ఓట్లు వాళ్లకే పడ్డాయి. అయితే, వైసీపీ రెబెల్స్ టీడీపీకి ఓటు వేశారా? లేక సొంత పార్టీలో రెబెల్స్ గా ముద్రపడిన వారే టీడీపీకి ఓటువేశారా అన్నది తెలియాల్సి ఉంది.

ఇక్కడే చంద్రబాబు వ్యూహం ఫలించింది. ఎందుకంటే, ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని చంద్రబాబు నిలబెట్టడంతో విపరీతమైన డిస్కషన్ జరిగింది. బలం లేకుండానే చంద్రబాబు ఏ ధైర్యంతో ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టారు? ఇప్పటికే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దానికి తోడు పక్క పార్టీల నుంచి వచ్చిన 5మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 156 ఎమ్మెల్యేలతో ఎదురులేని, తిరుగులేని పార్టీగా అత్యంత బలంగా ఉన్న వైసీపీని ఎదుర్కొని తమ అభ్యర్థిని చంద్రబాబు ఎలా గెలిపించుకుంటారు అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఇక్కడే చంద్రబాబు వ్యూహం ఫలించింది అని చెప్పాలి. ఎంతో ధైర్యంతో చంద్రబాబు తమ అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా రాజకీయ ఎత్తుగడల్లో చంద్రబాబు ఏ విధంగా సక్సెస్ అవుతారు అనేది మరోసారి ప్రూవ్ అయ్యింది. అనురాధను గెలిచిపించింది సొంత పార్టీ ఎమ్మెల్యేలా? వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలా? అనేది తెలియాల్సి ఉంది.

ఇక, మరో విశేషం ఏంటంటే.. ఇవాళ తేదీ 23, ఏడాది 2023, నెల కూడా 3, టీడీపీ ఎమ్మెల్యేలు 23.. అన్నింటిలో కామన్ గా 23(రెండు మూడు) సంఖ్య ఉంది. దీంతో 23 అనేది టీడీపీకి ఒక లక్కీ నెంబర్ గా మారిందనే భిప్రాయం వ్యక్తమవుతోంది.