MLC Election Results 2023 : పవన్ కళ్యాణ్ మాట నిజమైంది.. ఈ ఎన్నికలు శుభపరిణామం.. గంటా శ్రీనివాసరావు

వైసీపీ వ్యతిరేక ఓటు చీలినివ్వనన్న పవన్ కళ్యాణ్ మాట ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజమైంది అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.

MLC Election Results 2023 : పవన్ కళ్యాణ్ మాట నిజమైంది.. ఈ ఎన్నికలు శుభపరిణామం.. గంటా శ్రీనివాసరావు

MLC Election Results 2023 In AP TDP

MLC Election Results 2023: ఆంధ్రప్రదేశ్ లోని పట్టభద్రులు(గ్రాడ్యుయేట్‌), ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ హవా కొనసాగిస్తోంది. టీడీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంలో కొనసాగుతున్న క్రమంలో టీడీపీ నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయదుంధుబి సాగించానికి ఈ ఎన్నికలు ఓ శుభపరిణామం అంటూ టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పలు సభల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించారు.

MLC Election Results 2023: ఏపీ ప్రజల్లో తిరుగుబాటుకు నిదర్శనం..ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి భారీ ఆధిక్యం : ఎమ్మెల్యే బాలకృష్ణ

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అంటూ పవన పదే పదే చెబుతున్నారు. అలా పవన్ పలికిన మాటలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విషయం నిజమయ్యాయని గంటా అన్నారు. చతుర్ముఖ పోటీ కొనసాగిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడ చీలిపోలేదని..ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపదెబ్బ అంటూ పేర్కొన్నారు గంటా శ్రీనివాసరావు.

మూడేళ్ల క్రితం 50శాతం పైగా ఓటింగ్ సాధించిన వైసీపీ ఇప్పుడు 30శాతంకు పడిపోయిందని ఇక వైసీపీ పతనం ప్రారంభమైందన్నారు. అదే సమయంలో టీడీపీ విజయం ఖాయం అని ఎమ్మెల్సీ ఎన్నికల విజయ పరంపర.. ఒరవడి వచ్చే ఎన్నికలకు నాంది అని చెప్పుకొచ్చారు. 2024లో టీడీపీదే విజయం అని ధీమా వ్యక్తంచేశారు గంటా శ్రీనివాసరావు. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ చేసిన మోసాన్ని ప్రజలు గుర్తించారని చెప్పటానికి విశాఖ రాజధానిగా ఏర్పడటం ఉత్తరాంధ్ర ప్రజలకు ఏమాత్ర ఆమోదం కాదని ఈ ఎన్నికలు చాటి చెప్పాయని గంటా అన్నారు.

Pawan Kalyan: కులాల మధ్య చిచ్చుపెట్టేలా కుట్రలు జరుగుతున్నాయ్.. ఆ ఉచ్చులో ఎవరూ పడొద్దు ..

విశాఖే రాజధాని అని పదే పదే చెప్పే జగన్ ఇక తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతున్నానని ఇక జులై నుంచి పాలన విశాఖ నుంచే జరుగుతుందని తాజగా కూడా ప్రకటించారు జగన్.. కానీ విశాఖ రాజధానిగా ఏర్పాటు అవ్వటం పట్ల ఉత్తరాంధ్ర ప్రజలు ఏమాత్రం ఆమోదం కాదని ఈ ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ అని టీడీపీ నేతలు చెబుతున్నారు. జగన్ విశాఖే రాజధాని అక్కడనుంచి ఇక పాలన అని ప్రకటించినా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకే పట్టం కట్టిన సందర్భాన్ని బట్టి ప్రజల మనోభావాలు ఏంటో అర్థం చేసుకోవచ్చని టీడీపీ నేతలు చెబుతున్నారు.

CM Jagan-Nara Lokesh : జగన్ ఢిల్లీ టూర్‌.. ‘ఆ మూడు పాయింట్ల’తో నారా లోకేశ్ సెటైర్లు