Pawan Kalyan: కులాల మధ్య చిచ్చుపెట్టేలా కుట్రలు జరుగుతున్నాయ్.. ఆ ఉచ్చులో ఎవరూ పడొద్దు ..

ఈరోజు తిరుపతి కావచ్చు, రేపు మరొక ప్రాంతం కావచ్చు. ప్రజల మధ్య సఖ్యత లేకుండా విబేధాలు ఉండేలా చేయడమే కుట్రదారుల పన్నాగం. ఈ తరుణంలో అన్ని కులాలవారూ, ముఖ్యంగా యువతరం అప్రమత్తంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ మేరకు జనసేన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ లేఖను విడుదల చేశారు.

Pawan Kalyan: కులాల మధ్య చిచ్చుపెట్టేలా కుట్రలు జరుగుతున్నాయ్.. ఆ ఉచ్చులో ఎవరూ పడొద్దు ..

Pawan Kalyan

Pawan Kalyan: కులాల మధ్య చిచ్చుపెట్టేలా అధికార పక్షం కుయుక్తులు పన్నుతోందని, ఆ ఉచ్చులో ఎవరూ పడకుండా, కులాల మధ్య విద్వేషాలను సృష్టించే చర్యలకు పాల్పడుతున్న వారిని ఆదిలోనే నిలువరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. కులాల మధ్య అంతరాలు తగ్గించి, అందరి మధ్య సఖ్యత పెంచేందుకు జనసేన పార్టీ తపిస్తోందని, ఆ దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. అయితే, ఇందుకు భిన్నంగా అధికార పక్షం కుయుక్తులు పన్నుతోందని పవన్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో సమాచారం అందుతోందని అన్నారు. ఈ కుతంత్రాలు తిరుపతి నగరంలో మొదలయ్యాయని అన్నారు.

Pawan Kalyan : దెబ్బ పడే కొద్దీ బలపడుతున్నాం, త్వరలోనే జనసేన ప్రభుత్వాన్ని స్ధాపిస్తాం-పవన్ కల్యాణ్

బలిజలు, యాదవుల మధ్య సఖ్యతను విచ్ఛిన్నం చేసేలా కొందరు అధికార పార్టీ వ్యక్తులు చేస్తున్న రెచ్చగొట్టే చర్యలను ప్రతీఒక్కరూ ఖండించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ ఉచ్చులో ఎవరూ పడకుండా, ఆ విధమైన కుతంత్రాలకు పాల్పడుతున్న వారిని ఆదిలోనే నిలువరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జనసేన అధినేత సూచించారు. కులాల మధ్య చిచ్చులురేపి కొందరు తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, అందులో భాగంగానే బలిజలకి, యాదవులకు మధ్య దూరం పెరిగేలా కుట్రలకు తెరతీశారని పవన్ ఆరోపించారు.

Pawan Kalyan : కాపులే కాదు నా అభిమానులూ నాకు ఓటేయలేదు, అండగా ఉంటే పైకి తీసుకొస్తా-పవన్ కల్యాణ్

ఆ రెండు కులాల్లోనూ వర్గాలు ఏర్పాటు చేసి ఐకమత్యాన్ని దెబ్బతీసి వారు ఆధిపత్యం చలాయించాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు తిరుపతి కావచ్చు, రేపు మరొక ప్రాంతం కావచ్చు. ప్రజల మధ్య సఖ్యత లేకుండా విబేధాలు ఉండేలా చేయడమే కుట్రదారుల పన్నాగం అని, ఈ తరుణంలో అన్ని కులాలవారూ ముఖ్యంగా యువతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కులాల మధ్య చిచ్చుపెట్టేవారికి ప్రజాస్వామ్య పంథాలోనే సమాధానం ఇవ్వాలని, అందరూ ఒకేతాటిపైకి వచ్చి ప్రజల మధ్య దూరం పెంచే కుట్రదారుల చర్యలను నిరసించాలని పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు.