Pawan Kalyan : కాపులే కాదు నా అభిమానులూ నాకు ఓటేయలేదు, అండగా ఉంటే పైకి తీసుకొస్తా-పవన్ కల్యాణ్

కాపులు తనకు అండగా ఉంటే, వారిని అన్ని విధాల పైకి తీసుకొస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. దేహీ అనే పరిస్థితి రాకుండా చేస్తానని చెప్పారు. కాపు సంక్షేమ శాఖ ప్రతినిధులతో జనసేనాని పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా ప్రతికూల పవనాల్లోనే పార్టీని నడుపుతున్నా అన్న పవన్.. అనుకూల పవనాలు రాలేదన్నారు.

Pawan Kalyan : కాపులే కాదు నా అభిమానులూ నాకు ఓటేయలేదు, అండగా ఉంటే పైకి తీసుకొస్తా-పవన్ కల్యాణ్

Pawan Kalyan : కాపులు తనకు అండగా ఉంటే, వారిని అన్ని విధాల పైకి తీసుకొస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. దేహీ అనే పరిస్థితి రాకుండా చేస్తానని చెప్పారు. కాపు సంక్షేమ శాఖ ప్రతినిధులతో జనసేనాని పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా ప్రతికూల పవనాల్లోనే పార్టీని నడుపుతున్నా అన్న పవన్.. అనుకూల పవనాలు రాలేదన్నారు.

ఎన్నికల్లో తాను పోటీ చేసే స్థానంపై ఒక్కొక్కరూ ఒక్కో చోట పోటీ చేయండని సూచిస్తున్నారని పవన్ చెప్పారు. గాజువాక, పిఠాపురం, భీమవరం సెగ్మెంట్లలో పోటీ చేయండని అంటున్నారని పవన్ తెలిపారు. కాపులంతా తనకు ఓట్లేస్తే గతంలో పోటీ చేసిన రెండు స్థానాల్లో తాను గెలిచేవాడిని అన్నారు పవన్. నా అభిమానులు కూడా రాజకీయం వచ్చేసరికి ఓటేయలేదని పవన్ వాపోయారు. ఇది వాస్తవం అని, అంతా అంగీకరించాలన్నారు.

Also Read..Anantapur Lok Sabha constituency: పవన్ కల్యాణ్‌ను పోటికి దించుతారా.. కొత్త ముఖాలేమైనా బరిలోకి దిగబోతున్నాయా?

”నేనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు చేయగలను. కానీ నాకు పేదల సేవలోనే తృప్తి. మా కులపొడే అంటూ తిడుతున్నారు. నన్ను విమర్శించు.. కానీ కులాన్ని కించపరచడం దేనికి..? నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. కాపులు కొద్దిగా మెత్తగా మాట్లాడండి. వీలుంటే సాయం చేయండి.. లేదా సాయం అందే దారి చూపండి. ఇప్పుడొచ్చి మా కులం అంటున్నారు. కానీ ఎన్నికల్లో వేరే వారికి ఓటేస్తున్నారు.

Also Read..Pawan Kalyan : కాపు-బీసీ కలిస్తే మనదే అధికారం, సగం పదవులు బీసీలకే- పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

ఓటుకు డబ్బు తీసుకోకూడదు. ఒకవేళ డబ్బులు తీసుకోవడం ఆగకుంటే.. అక్కడ తీసుకుని గ్లాసు గుర్తుకు ఓటేయండి. వైసీపీకి మాత్రం ఓటేయొద్దు. తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లి మరీ కాపులు నాకు అక్కర్లేదన్న జగన్ కు ఓటేశారు. నా ఆత్మ గౌరవాన్ని ప్రశ్నిస్తున్న మీరు.. మీ ఆత్మ గౌరవం గురించి ఎందుకు ఆలోచించరు. గతంలో తునిలో మీటింగ్ పెట్టి కాపు రిజర్వేషన్లు డిమాండ్ చేసిన వారు.. ఇప్పుడు ఎందుకు మాట్లాడ్డం లేదు..? మీకు వ్యతిరేకులు ఉన్నప్పుడు మాట్లాడి.. మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాట్లాడరా..? అని పవన్ నిలదీశారు.