MLC Election Results 2023 : రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20వేలు చెల్లని ఓట్లు .. వైసీపీకి షాకిచ్చిన గ్రాడ్యుయేట్లు

రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20వేలు చెల్లని ఓట్లు పడ్డాయి.. ఈ ఎన్నికల్లో వైసీపీకి గ్రాడ్యుయేట్లు షాకి టీడీపీకి పట్టం కడుతున్నారు. అలా టీడీపీ విజయం దిశగా దూసుకుపోతున్న క్రమంలో చెల్లని ఓట్లలో ఎక్కువగా వైసీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డికి పడినవే ఉండటం గమనించాల్సిన విషయం..

MLC Election Results 2023 :  రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20వేలు చెల్లని ఓట్లు .. వైసీపీకి షాకిచ్చిన గ్రాడ్యుయేట్లు

MLC Election Results 2023:

MLC Election Results 2023 : ఆంధ్రప్రదేశ్ లోని పట్టభద్రులు(గ్రాడ్యుయేట్‌), ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అటు ఉత్తరాంధ్ర, ఇటు తూర్పు రాయలసీమల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ అన్ని రౌండ్లలోను టీడీపీ అభ్యర్థలే గెలుపు దిశగా దూసుకుపోతుంటే వైసీపీ అభ్యర్థులు మాత్రం డీలాపడిపోతున్నారు. ఈ క్రమంలో పట్టభద్రుల ఓట్ల లెక్కింపుల్లో ‘చెల్లని ఓట్లు’భారీగా బయటపడుతున్నాయి. అలా తూర్పురాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపుల్లో ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో దాదాపు 20వేల చెల్లని ఓట్లు బయటపడ్డాయి. ఇలా చెల్లని ఓట్లలో ఎక్కువగా వైసీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డికి పడినవే ఉండటం గమనించాల్సిన విషయం..

MLC Election Results 2023: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా..‘జైలు నుండి వచ్చిన సైకోల పాలనకు చరమగీతం’ అంటూ అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు

తూర్పు రాయలసీమలో ఆరో రౌండ్ లో టీడీపీకి 17,327 ఓట్లు, వైసీపీకి 11,522 ఓట్లు పడ్డాయి. ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ 22,979 ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు. మొత్తం ఆరు రౌండ్లలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ కు 99,617 ఓట్లు పోల్ అయ్యాయి. అలాగే ఆరు రౌండ్లలో వైసీపీ అభ్యర్థి ఎంపీ రామచంద్రారెడ్డికి 76,638 ఓట్లు పోల్ అయ్యాయి. అలా టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ 22,979లో ఆధిక్యంతో విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఇంకా  30,000 మొదటి ప్రాధాన్యత ఓట్లున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 1లక్షా 24వేల,180 ఓట్లు.

MLC Election Results 2023: ఏపీ ప్రజల్లో తిరుగుబాటుకు నిదర్శనం..ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి భారీ ఆధిక్యం : ఎమ్మెల్యే బాలకృష్ణ

ఇటు తూర్పు రాయలసీమల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోతున్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వంపై వ్యతికేతక మొదలైందని…టీడీపీ విజయదుంధుబి మొదలైంది అంటూ టీడీపీ నేతలు ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు భారీ అధక్యంతో దూసుకుపోతుండటంతో తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు.ముఖ్యంగా ఉత్తరాంధ్రాలోని విజయనగరంలోని అశోక్ బంగ్లాలో సంబరాల్లో మునిగితేలుతున్నారు టీడీపీ నేతలు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాల్లో టీడీపీ అభ్యర్థికి భారీ ఆధిక్యం రావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు బంగ్లాకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. బంగ్లాలో ఉత్సాహంతో గెంతులు వేస్తున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు.

MLC Election Results 2023 : పవన్ కళ్యాణ్ మాట నిజమైంది.. ఈ ఎన్నికలు శుభపరిణామం.. గంటా శ్రీనివాసరావు

Pawan Kalyan: కులాల మధ్య చిచ్చుపెట్టేలా కుట్రలు జరుగుతున్నాయ్.. ఆ ఉచ్చులో ఎవరూ పడొద్దు ..