Chandrababu : వచ్చే ఎలక్షన్స్ జగన్ పర్సెస్ పబ్లిక్.. ఇక ఏ ఎన్నికల్లోనూ గెలవడు : చంద్రబాబు

వచ్చే ఎన్నికలు జగన్ పర్సెస్ పబ్లిక్ గా జరుగుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ అరాచకాలు కొనసాగాలా? రాష్ట్ర భవిష్యత్తు కావాలా అని ప్రజలు ఆలోచిస్తున్నారు అని పేర్కొన్నారు. పులివెందుల్లోనూ తిరుగుబాటు మొదలైందన్నారు.

Chandrababu : వచ్చే ఎలక్షన్స్ జగన్ పర్సెస్ పబ్లిక్.. ఇక ఏ ఎన్నికల్లోనూ గెలవడు : చంద్రబాబు

CHANDRABABU

Chandrababu : వచ్చే ఎన్నికలు జగన్ పర్సెస్ పబ్లిక్ గా జరుగుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ అరాచకాలు కొనసాగాలా? రాష్ట్ర భవిష్యత్తు కావాలా అని ప్రజలు ఆలోచిస్తున్నారు అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు స్పందిస్తూ మాట్లాడారు. పులివెందుల్లోనూ తిరుగుబాటు మొదలైందన్నారు. తోటి వాళ్లను నేరాల్లో భాగస్వామ్యం చేయడం జగన్ నైజం అన్నారు. అధికారులను.. పారిశ్రామిక వేత్తలను జైళ్లకు తీసుకెళ్లారని పేర్కొన్నారు.

ఇప్పుడు ఏపీ ప్రజలను క్రైమ్ లో భాగస్వాములను చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. చెడుకు ఎప్పటికైనా ఓటమి ఖాయమన్నారు. జగన్ పని అయిపోయిందని తెలిపారు. జగన్ ఇక ఏ ఎన్నికల్లోనూ గెలిచేదే లేదన్నారు. వైసీపీ.. గాలికి వచ్చిన పార్టీ గాలికే కొట్టుకుపోతుందని చెప్పారు. ప్రజలని నిత్యం మోసం చేసినా పట్టించుకోరనే ధీమా జగన్ లో ఉండేదన్నారు. తాము ప్రజాస్వామాన్ని నమ్మితే.. జగన్ అరాచకాలను నమ్మారని విమర్శించారు.

Chandrababu slams Jagan: మధ్యంతర ఎన్నికలకు జగన్ సిద్ధమవుతున్నారు: చంద్రబాబు

ఏపీలో కీలకమైన నాలుగు వ్యవస్థలను సరిగా పని చేసుకోనివ్వడం లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలను ప్రహసనంగా మార్చారని పేర్కొన్నారు. కోర్టులు, జడ్జీలను బ్లాక్ మెయిల్ చేసే విధంగా వ్యవహరించారని విమర్శించారు. సీఎస్ తో సహా ఉన్నతాధికారులు కోర్టు ముందు నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎవ్వరూ సమావేశాలు పెట్టకూడని పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. పాదయాత్రలు, రోడ్ షోలకు ఆంక్షలు విధించారని తెలిపారు.

సభలో పాల్గొనడానికి తాను ఏడు కిలోమీటర్లు నడిచానని చెప్పారు. 108 నియోజకవర్గాల్లో జరిగాయని, ప్రజలు చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. ఓటుకు రూ. వేయి నుంచి రూ. 10 వేల వరకు ఇచ్చారని ఆరోపించారు. వెండి వస్తువులు ఇచ్చారని విమర్శించారు. దొంగ ఓట్లు నమోదు చేయించారు, ఫేక్ సర్టిఫిరెట్లతో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓట్లు నమోదు చేయించారని ఆరోపించారు. ఉగ్రవాదులు కూడా భయపడే చర్యలను వైసీపీ నేతలు చేస్తున్నారని వెల్లడించారు.