Sajjala Ramakrishna Reddy : ఈ ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం కాదు- ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్‌పై సజ్జల సంచలన వ్యాఖ్యలు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావు అని సజ్జల అన్నారు. పీడీఎఫ్, ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లే టీడీపీ వైపు మళ్లాయన్నారు. ఎన్నికలు జరిగిన స్థానాలు అన్నింటినీ కలిపి చూడాలన్నారు. ఏ రకంగానూ ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిఫలించవు అని స్పష్టం చేశారు.(Sajjala Ramakrishna Reddy )

Sajjala Ramakrishna Reddy : పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఫలితాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఏదో జరిగింది అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావు అని సజ్జల అన్నారు. పీడీఎఫ్, ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లే టీడీపీ వైపు మళ్లాయన్నారు. ఎన్నికలు జరిగిన స్థానాలు అన్నింటినీ కలిపి చూడాలన్నారు. ఏ రకంగానూ ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిఫలించవు అని స్పష్టం చేశారు.
”టీడీపీ సంబరాలు చేసుకోవటంతోనే అంతా అయిపోలేదు. ఈ ఫలితాలను మేము హెచ్చరికగా భావించడం లేదు. ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదు. ఒక వర్గం ఓటర్లను మొత్తానికి ఎలా ఆపాదిస్తారు?
మేము అందించే సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రులు ఓటర్లలో లేరు. అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షా 30వేల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. మొన్ననే కానిస్టేబుల్ పోస్టులకు రిక్రూట్ మెంట్ కూడా చేశాం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోయినా టీడీపీ పోటీ చేసింది.(Sajjala Ramakrishna Reddy )
తెలంగాణ తరహాలోనే ప్రయత్నాలు టీడీపీ చేయొచ్చు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు. కౌంటింగ్ లోనూ టీడీపీ పాల్పడిన అవకతవకలను ఎన్నికల అధికారులు గుర్తించారు. గ్రాడ్యుయేట్స్ లో మాకు ఓట్లు బాగానే వచ్చాయి. కమ్యూనిస్ట్ పార్టీలు.. వాళ్ల ఓట్లను టీడీపీకి బదిలీ చేశాయి. మేము మొదటిసారి టీచర్ ఎమ్మెల్సీల్లో పోటీ చేసి గెలవగలిగాం. గ్రాడ్యుయేట్స్ లో కింది స్థాయిలో తీసుకుని వెళ్లటంలో కొంత వెనుకబడ్డాం” అని సజ్జల అన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి ప్రతికూల పవనాలు వీచాయి. పట్టభద్రులు టీడీపీకి పట్టం కట్టారు. ఈ ఫలితాలు రాజకీయాల్లో హీట్ పెంచాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఈ ఫలితాలే నిదర్శనం అని టీడీపీ అంటోంది. తాజాగా ఈ ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందింస్తూ.. ఓట్ల బండిల్ లో ఏదో గందరగోళం జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. కౌంటింగ్ లో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.(Sajjala Ramakrishna Reddy )
ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏదో మారిపోయిందని అనుకోవద్దు అంటూ టీడీపీని ఉద్దేశించి సజ్జల అన్నారు. అంతేకాదు.. పట్టభద్రుల ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావన్న సజ్జల.. పీడీఎఫ్, వామపక్ష పార్టీల ఓట్లు టీడీపీకి వెళ్లాయని విశ్లేషించారు. టీడీపీ బలం పెరిగిందనడం హాస్యాస్పదం అన్నారు. అంతేకాదు ఈ ఫలితాలు ఏ రకంగానూ ప్రభావం చూపబోవని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అని భావించలేమని సజ్జల స్పష్టం చేశారు.
Also Read..Pithapuram Assembly constituency: పవన్ కల్యాణ్.. పిఠాపురం నుంచే పోటీ చేయబోతున్నారా?
ఇక్కడ ఓట్లు వేసింది సమాజంలో ఓ చిన్న భాగం మాత్రమేనని సజ్జల చెప్పారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు వైసీపీని ఆదరించారన్న విషయాన్ని గమనించాలన్నారు. తొలిసారి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం తమకు పెద్ద విజయం అని సజ్జల కామెంట్ చేశారు.(Sajjala Ramakrishna Reddy )