Asaduddin Owaisi: యోగి ‘హిందుత్వ’ వ్యాఖ్యలపై మండిపడ్డ ఓవైసీ.. రాజ్యాంగ ప్రమాణం గుర్తుంచుకోవాలంటూ హితవు

రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన యోగి.. ఒక మతాన్ని జాతీయ మతమని చెప్పడం సరికాదు. రాజ్యాంగంలో అలా ఏం రాయలేదు. అన్ని మతాలను సమానంగా చూశారు. పైగా మతాన్ని ప్రజల వ్యక్తిగతానికి వదిలేశారు. కానీ దేశానికంటూ ఒక మతముందని చెప్పలేదు

Asaduddin Owaisi: హిందూ సనాతన ధర్మం ఈ దేశ జాతీయ మతమంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయ్యాక ఇలా ఒక మతాన్ని గురించి మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నంత కాలం, దేశంలో అన్ని మతాలకు సమాన గౌరవం ఉంటుందని, దాన్ని ఎవరూ చెరిపివేయలేరని ఓవైసీ స్పష్టం చేశారు.

BJP vs Congress: ముషార్రఫ్ మరణంపై థరూర్ కామెంట్స్ ఎఫెక్ట్.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం

సనాతన ధర్మం జాతీయ మతమంటూ నాలుగు రోజుల్లో రెండు సార్లు వ్యాఖ్యానించారు సీఎం యోగి. తాను హిందువునని, ఇతర మతాల ప్రదేశాలకు వెళ్లనని ఖరాఖండీగా చెప్పుకునే యోగి.. ఇలా ఒక మతాన్ని జాతీయ మతంగా గుర్తిస్తూ వ్యాఖ్యానించడం పట్ల పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక మతాన్ని విశ్వసిస్తే మంచిదే కానీ, అందుకు ఇతర మతాల్ని దూషించాల్సిన అవసరం లేదంటూ విమర్శించారు.

Supreme Court: న్యాయవ్యవస్థ కొత్తగా ముందుకు రావాలి.. సింగపూర్‌ చీఫ్‌ జస్టిస్‌ సుందరేశ్‌ మేనన్‌

ఇక ఇదే విషయమై ఆదివారం ఓవైసీ స్పందిస్తూ ‘‘బాబాసాహేబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నంత కాలం, ఈ దేశంలో అన్ని మతాలు సమాన గౌరవాన్ని పొందుతున్నాయి. అందరికీ హక్కులు ఉంటాయి. ప్రజలు ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా పాటిస్తారు’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన యోగి.. ఒక మతాన్ని జాతీయ మతమని చెప్పడం సరికాదు. రాజ్యాంగంలో అలా ఏం రాయలేదు. అన్ని మతాలను సమానంగా చూశారు. పైగా మతాన్ని ప్రజల వ్యక్తిగతానికి వదిలేశారు. కానీ దేశానికంటూ ఒక మతముందని చెప్పలేదు’’ అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు