Rajaouri Firings: క్రికెట్ మ్యాచ్ కంటే ముందే బుల్లెట్ల వర్షం ఆగిపోవాలి.. ప్రధాని మోదీకి ఓవైసీ డిమాండ్

పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాదులు వచ్చి మన సైనికులను హతమార్చడంపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? పుల్వామా జరిగినప్పుడు మీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత మన కల్నల్.. డిప్యూటీ ఎస్పీని చంపేశారు

Asduddin Owaisi: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. రాజౌరిలోని అనంత్‌నాగ్‌లో మన సైనికుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని, ప్రభుత్వం మౌనంగా ఉందని ఆయన అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజౌరిలో కాశ్మీరీ పండిట్లతో, భారత సైనికులతో బుల్లెట్ల క్రికెట్ మ్యాచ్ జరుగుతోందని, మన ప్రజలను చంపుతున్నారని అన్న ఓవైసీ.. క్రికెట్ మ్యాచ్‌కు ముందే ఈ హింసను ముగించాల్సిన అవసరం ఉందని సూచించారు.

‘‘మీరు (బీజేపీ) అధికారంలో ఉన్నారు. హింసను, కాల్పులను ఆపాల్సిన బాధ్యత మీది. ఒకవేళ మీరు అధికారంలో లేకుంటే ఏం చెప్పేవారు? క్రికెట్ మ్యాచ్ కంటే ముందు ఈ బుల్లెట్ల వర్షాన్ని ఆపండి’’ అని కేంద్రాన్ని ఓవైసీ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీ ఎందుకు ఉదాసీనంగా ఉన్నారంటూ ఆయన ప్రశ్నించారు. ‘‘పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాదులు వచ్చి మన సైనికులను హతమార్చడంపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? పుల్వామా జరిగినప్పుడు మీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత మన కల్నల్.. డిప్యూటీ ఎస్పీని చంపేశారు.. ఇప్పుడు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు.. ప్రధాని మోదీ ఎందుకు ఉదాసీనంగా మారారు?’’ అని ఓవైసీ అన్నారు.

Shah and Nitish: నితీశ్ కుమార్ ప్రధాని అభ్యర్థిత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అమిత్ షా

భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆర్టికల్ 370 రద్దుతో అన్నీ పరిష్కారమయ్యాయని మీరు చెప్పారు. బీజేపీ కశ్మీర్ విధానం విఫలమైంది. పాక్ ఉగ్రవాదులు ఇక్కడ బుల్లెట్ల ఆట ఆడుతున్నారు. మీరు (మోదీ) గుజరాత్‌లో ఉన్నారా? నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడుతుందా.. ఈ ప్రశ్నకు దేశ ప్రజలకు బీజేపీ సమాధానం చెప్పాలి’’ అని ఓవైసీ ప్రశ్నించారు. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో జరిగే క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.