Owaisi to Modi: చైనా అంటే ఎందుకు అంత భయం? మోదీకి ఓవైసీ సూటి ప్రశ్న
ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ కూడా మోదీపై విరుచుకుపడ్డారు. చైనాలోని వీఘర్లపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై చర్చ కోసం యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో ముసాయిదా తీర్మానంపై ఓటింగ్ నుంచి భారత దేశం గైర్హాజరైందని, మన భూమిని కబ్జా చేసిన చైనాను జవాబుదారీ చేయడం అటుంచి, మానవ హక్కుల ఉల్లంఘనలపై చైనాను ఖండించడానికైనా మన ప్రధాన మంత్రి మోదీ ముందుకు రాలేకపోతున్నారని అన్నారు
- tony bekkal
- Published on- October 7, 2022 / 07:41 PM IST
why modi scaring to jinping asks owaisi
Owaisi to Modi: చైనాలోని జింజియాంగ్ ప్రాంతంలో మానవ హక్కుల పరిస్థితిపై చర్చించాలని కోరుతూ ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానంపై ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల మండలిలో భారత్ ఓటు వేయకపోవడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చైనాకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని, చైనాకు మోదీ ఎందుకు భయపడుతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు.
శుక్రవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓవైసీ స్పందిస్తూ ‘‘వీఘర్ ముస్లింల సమస్యపై ముఖ్యమైన ఓటు వేయకుండా ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి గైర్హాజరై, చైనాకు సాయపడాలని భారత్ ఎందుకు నిర్ణయం తీసుకుందో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివరిస్తారా? తాను 18 సార్లు కలిసిన జీ జిన్‌పింగ్‌ను ఇబ్బంది పెట్టడానికి మోదీ భయపడుతున్నారా? సరైనదాని గురించి భారత్ మాట్లాడలేకపోతోందా?’’ అని ట్వీట్ చేశారు.
Xiaomi: ఇండియా నుంచి పాకిస్తాన్‌కు మారనున్నట్లు ప్రచారంపై షియోమి ఏమందంటే?
ఇక ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ కూడా మోదీపై విరుచుకుపడ్డారు. చైనాలోని వీఘర్లపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై చర్చ కోసం యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో ముసాయిదా తీర్మానంపై ఓటింగ్ నుంచి భారత దేశం గైర్హాజరైందని, మన భూమిని కబ్జా చేసిన చైనాను జవాబుదారీ చేయడం అటుంచి, మానవ హక్కుల ఉల్లంఘనలపై చైనాను ఖండించడానికైనా మన ప్రధాన మంత్రి మోదీ ముందుకు రాలేకపోతున్నారని అన్నారు. చైనా అంటే మోదీ ఎందుకు భయపడుతున్నారని ఆమె సైతం ప్రశ్నించారు.
చైనాలోని జింజియాంగ్‌లో వీఘర్ ముస్లింలపై మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, వీటిపై చర్చించాలని ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి తిరస్కరించింది. భారత్, మలేసియా, ఉక్రెయిన్ సహా 11 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరుకాగా, 19 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఈ తీర్మానాన్ని కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్, బ్రిటన్, అమెరికా ప్రతిపాదించాయి. టర్కీ వంటి దేశాలు బలపరిచాయి. ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, నెదర్లాండ్స్ ఈ తీర్మానానికి మద్దతిచ్చాయి. మొత్తం మీద చైనాకు అనుకూల పరిస్థితి ఏర్పడింది.
Hyd Metro: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. సోమవారం నుంచి రాత్రి 11 వరకు మెట్రో
