Xiaomi: ఇండియా నుంచి పాకిస్తాన్‭కు మారనున్నట్లు ప్రచారంపై షియోమి ఏమందంటే?

షియోమి ఆస్తులను స్తంభింపజేయడానికి ఏప్రిల్ 29న ఈడీ ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధిస్తూ ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ (ఫెమా) అథారిటీ సైతం సెప్టెంబర్ 29 మరోసారి ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దీనిని సవాలు చేస్తూ శుక్రవారం కర్ణాటక హైకోర్టును షియోమి మరోసారి ఆశ్రయించింది. విచారణ సమయంలో విదేశీ బ్యాంకు ప్రతినిధిని పరిశీలించడానికి అనుమతించలేదనే కారణంతో అప్పీల్ ఆర్డర్‌ను సవాలు చేస్తున్నట్లు షియోమి తన పిటిషన్‌లో పేర్కొంది.

Xiaomi: ఇండియా నుంచి పాకిస్తాన్‭కు మారనున్నట్లు ప్రచారంపై షియోమి ఏమందంటే?

Xiaomi responds moving its India operations to Pakistan

Xiaomi: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ ఇండియాలోని తయారీ యూనిట్‭ను పాకిస్తాన్‭కు మార్చుతున్నారంటూ వస్తున్న ప్రచారాన్ని ఆ కంపెనీ ఖండించింది. తాము ఎనిమిదేళ్లుగా ఇండియాలో తమ ఉత్పత్తులను రూపొందిస్తున్నామని, వాటిని అలాగే కొనసాగిస్తామని కంపెనీ పేర్కొంది. కొద్ది రోజుల క్రితం ఈ కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు చేసింది. ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ నిబంధనల ఉల్లంఘిన కింద ఆ కంపెనీకి చెందిన 5,551 కోట్ల రూపాయల నిధులను సీజ్‌ చేసింది. ఈ దాడులతోనే ఇండియా నుంచి పాక్ మారనున్నట్లు ప్రచారం సాగుతోంది.

కంపెనీ పాకిస్తాన్ మారుతున్నట్లు వచ్చిన ఒక ట్వీట్‭పై షియోమి స్పందిస్తూ ‘‘ఇది పూర్తిగా తప్పుడు ట్వీట్, నిరాధారమైంది కూడా. భారతదేశంలో 2014 నుంచి షియోమి తన ఉత్పత్తులను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా 99 శాతం స్మార్ట్‭ఫోన్లు, 100 శాతం టీవీలు ఇండియాలోనే తయారు చేస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా జర్నీలో మేము విజయవంతంగా దూసుకెళ్తున్నాం. తప్పుడు, ఆధారరహితమైన ప్రచారం వల్ల మా ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము’’ అని ట్వీట్ చేశారు.

Unburnt Ravan Heads: రావణుడి 10 తలలు కాలలేదని ఒక ఉద్యోగి సస్పెండ్.. నలుగురు అధికారులకు నోటీసులు

షియోమి ఆస్తులను స్తంభింపజేయడానికి ఏప్రిల్ 29న ఈడీ ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధిస్తూ ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ (ఫెమా) అథారిటీ సైతం సెప్టెంబర్ 29 మరోసారి ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దీనిని సవాలు చేస్తూ శుక్రవారం కర్ణాటక హైకోర్టును షియోమి మరోసారి ఆశ్రయించింది. విచారణ సమయంలో విదేశీ బ్యాంకు ప్రతినిధిని పరిశీలించడానికి అనుమతించలేదనే కారణంతో అప్పీల్ ఆర్డర్‌ను సవాలు చేస్తున్నట్లు షియోమి తన పిటిషన్‌లో పేర్కొంది.

ఇక పోతే, జియోమీ ఇండియా రూ.5,551.27 కోట్ల సొమ్మును అన‌ధికారికంగా భార‌త్ ఆవ‌ల‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసింద‌ని ఫెమా అథారిటీ పేర్కొంది. రాయ‌ల్టీ పైసా చెల్లించ‌కుండానే విదేశాల‌కు విదేశీ మార‌క ద్ర‌వ్యం అక్ర‌మ మార్గాల్లో బ‌దిలీ చేయ‌డం ఫెమా నిబంధ‌న‌ల‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా ఉల్లంఘించ‌డ‌మేనని ఫెమా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Karnataka: ఓలా, ఊబర్, రాపిడో ఆటోలు ఆపేయండి.. నోటీసులు జారీ చేసిన రవాణా శాఖ