Padmarao: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు చర్చిస్తున్నట్లు ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై పద్మారావు స్పందించారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడతూ… తనకు ప్రగతి భవన్ కు వెళ్లేందుకు తనకు ఎలాంటి అడ్డంకులూ లేవని వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, కొందరు బీజేపీ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్ లోనే ఉంటానని ఆయన చెప్పారు. బూర నర్సయ్య పార్టీ మారినంత మాత్రాన తాను మారబోనని వ్యాఖ్యానించారు. తన కూతురి పెళ్లి తర్వాత కిషన్ రెడ్డి తమ ఇంటికి వచ్చి ఆశీర్వదించారని చెప్పారు. అప్పట్లో అసెంబ్లీలో నేను, కిషన్ రెడ్డి పక్క పక్క సీట్లలోనూ కూర్చే వాళ్లమని తెలిపారు. కాగా, నిన్న కూడా హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌తో పద్మారావు సమావేశమై చర్చించారు. గత నాలుగు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోపై కేటీఆర్ కు ఆయన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..