Seema Haider: సీమా హైదర్‭ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? టికెట్ ఇస్తానంటున్న అథవాలే.. ఎక్కడి నుంచో తెలుసా?

ఆమె రాజకీయాల్లోకి రానున్నారని, ఎన్నికల్లో పోటీ చేయనుందని కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. అయితే ఇదే విషయాన్ని ఆ పార్టీ చీఫ్ అథవాలె దగ్గర ప్రస్తావించింది మీడియా. ఆమెకు వేరే చోటు నుంచి టికెట్ ఇస్తామంటూ మరింత ఆసక్తిని పెంచారు.

Ramdas Athawale: భారత ప్రేమికుడిని పెళ్లి చేసుకోవడం కోసం భర్తతో పాటు పాకిస్తాన్ దేశాన్ని వదిలేసిన వచ్చిన సీమా హైదర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాకు వచ్చినప్పటి నుంచి భారత మీడియాలో తరుచూ ఆమె పేరు వినిపిస్తూనే ఉంది. ఈ మధ్యే ఆమెకు సినిమా ఆఫర్ కూడా వచ్చిందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఆమె రాజకీయాల్లోకి రానున్నారా అనే చర్చ కూడా మొదలైంది. కేంద్రమంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలె) చీఫ్ రాందాస్ అథవాలే ఆమెకు టికెట్ ఇస్తానంటూ వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం.

Meenakshi Lekhi: పార్లమెంటులో ఈడీ గురించి మాట్లాడి అడ్డంగా ఇరుక్కున్న కేంద్ర మంత్రి

ఆమె రాజకీయాల్లోకి రానున్నారని, ఎన్నికల్లో పోటీ చేయనుందని కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. అయితే ఇదే విషయాన్ని ఆ పార్టీ చీఫ్ అథవాలె దగ్గర ప్రస్తావించింది మీడియా. వాస్తవానికి ఈ వాదనను కొట్టిపారేసిన ఆయన.. తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఆమెకు వేరే చోటు నుంచి టికెట్ ఇస్తామంటూ మరింత ఆసక్తిని పెంచారు. మహారాష్ట్రలోని ఏ నియోజకవర్గం నుంచి ఆమెకు టికెట్ వస్తుందనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఆమెకు పాకిస్తాన్ నుంచి టికెట్ ఇస్తామని ఇప్పటి వరకు జరిగిన చర్చకు ఆయన చెక్ పెట్టారు.

Rahul Gandhi: సుప్రీంలో ఊరట సరే.. ఇంతకీ రాహుల్ గాంధీ సభ్యత్వం ఎప్పుడు పునరుద్ధరించబడుతుంది?

‘‘ఎన్నికల్లో పోటీ చేసేందుకు మేం ఆమెకు టికెట్ ఇవ్వబోము. అయితే పాకిస్థాన్‌కు మాత్రం కచ్చితంగా టిక్కెట్ ఇస్తాం’’ అని అన్నారు. అంటే ఆమె తిరిగి పాకిస్తాన్ వెళ్లేందుకు టికెట్ ఇస్తామని అథవాలే స్పష్టం చేశారు. ఇలాంటి చర్చ పార్టీలో ఎప్పుడూ రాలేదని, మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయని ఆయన అన్నారు. వాస్తవానికి తమ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా, ఆమెకు పదవులు ఇస్తామని, ఎన్నికల బరిలోకి దింపుతామని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు కిషోర్ మసూమ్ అన్నారు.

Mizoram : పుస్తకాల బ్యాగు, యూనిఫామ్‌తో స్కూలుకి వెళ్తున్న 78 ఏళ్ల వృద్ధుడు .. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

దీనికి ముందు కిషోర్ మాట్లాడుతూ.. ‘‘సీమకు భారత పౌరసత్వం లభిస్తే, దర్యాప్తు సంస్థ క్లీన్ చిట్ ఇచ్చినట్లే. ఆమెను మా పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మా గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు సీమ హైదర్‌ను ఉత్తరప్రదేశ్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా, జాతీయ అధికార ప్రతినిధిని చేస్తాను’’ అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు