100 రోజుల పాలనలో జగన్ చేసిన మంచి పని ఇదొక్కటే

జగన్ 100 రోజుల పాలనపై జనసేనాని పవన్ బుక్ లెట్ విడుదల చేశారు. జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ 100 రోజుల పాలనలో చేసిన మంచి ఒక్కటే అని పవన్

  • Publish Date - September 14, 2019 / 06:37 AM IST

జగన్ 100 రోజుల పాలనపై జనసేనాని పవన్ బుక్ లెట్ విడుదల చేశారు. జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ 100 రోజుల పాలనలో చేసిన మంచి ఒక్కటే అని పవన్

జగన్ 100 రోజుల పాలనపై జనసేనాని పవన్ బుక్ లెట్ విడుదల చేశారు. జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. వంద రోజుల పాలనలో జగన్ చేసిన మంచి ఒక్కటే అని పవన్ అన్నారు. అది మద్యపాన నిషేధం అని చెప్పారు. అయితే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలవుతుందో లేదోనన్న అనుమానం వ్యక్తం చేశారు పవన్. 100 రోజుల్లో ఇసుక పాలసీనే తీసుకురాలేకపోయారని పవన్ అన్నారు. జగన్ 100 రోజుల పాలనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది ఉపాధి కోల్పోయారని చెప్పారు. కేంద్రం చెప్పినా వినకుండా పీపీఏలను రద్దు చేసి గందరగోళం సృష్టించారని జగన్ సర్కార్ పై పవన్ మండిపడ్డారు. 35 దేశాల నుంచి రాయబారులను పిలిచి ఏం సాధించారని నిలదీశారు.

పాలన వ్యాపారిలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పవన్ హెచ్చరించారు. జగన్ పాలనలో పారదర్శకత, దార్శనికత లోపించిందని జనసేన బుక్ లెట్ లో తెలిపారు. 9 అంశాలపై 33 పేజీల నివేదిక విడుదల చేశారు జనసేనాని. ఇసుక విధానం, పెట్టుబడులు ఆకర్షించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్రం చెప్పినా వినకుండా పీపీఏలు రద్దు చేశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం, ప్రజారోగ్యం పడకేసిందన్నారు. శాంతిభద్రతలు క్షీణించాయని, స్కూల్స్ లో మౌలిక వసతులు లేవని పవన్ అన్నారు. అందరినీ బెదిరిస్తుంటే పెట్టుబడులు ఎవరు పెడతారని పవన్ ప్రశ్నించారు.

Also Read : టీడీపీలానే వైసీపీ దెబ్బతింటుంది : పార్టీ కేడర్ కోసమే వాలంటీర్ ఉద్యోగాలు