Pawan Kalyan With Chandrababu
Pawan Kalyan : చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఢిల్లీ టూర్ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబుతో పవన్ సమావేశం కానున్నారు. ఢిల్లీలో నిన్న అమిత్ షా, జేపీ నడ్డాతో జరిగిన భేటీ వివరాలను పవన్ తో చంద్రబాబు చర్చిస్తారని తెలుస్తోంది. బీజేపీ టీడీపీ పొత్తు విషయంలో అమిత్ షాతో భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలను పవన్ కు వివరించే అవకాశం ఉంది.
చంద్రబాబుతో సమావేశం తర్వాత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో పొత్తులపై చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుతో సమావేశం తర్వాత పవన్ కల్యాణ్ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరతారని సమాచారం.