జనసేనాని రాయలసీమ పర్యటన షెడ్యూల్

  • Publish Date - February 19, 2019 / 06:54 AM IST

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. త్వరలో పవన్ కళ్యాణ్ రాయలసీమలో పర్యటించనున్నారు. పవన్ టూర్ షెడ్యూల్ ఖరారు అయింది. ఫిబ్రవరి 21 వ తేదీ నుంచి 23 వరకు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 25 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు కడప జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. ఫిబ్రవరి 28, మార్చి 1, 2వ తేదీల్లో చిత్తూరు జిల్లాలో జనసేనాని పర్యటన చేయనున్నారు. పవన్… కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. యురేనియం, స్టీల్ ప్లాంట్ ను జనసేనాని పరిశీలించనున్నారు. స్వారత్రిక ఎన్నికలు, పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇదివరకే ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించారు.