Mlc Kavitha Arrest : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వెనుక స్ట్రాటజీ అదే..! ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ

ఎన్నికల వేళ కవిత అరెస్ట్ అంశాన్ని ఎలా చూడాలి? దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందా? రాజకీయంగా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి?

Professor Nageshwar On Mlc Kavitha Arrest

Mlc Kavitha Arrest : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కవిత నివాసంలో దాదాపు 4 గంటల పాటు సోదాలు జరిపిన ఈడీ అధికారులు.. మనీలాండరింగ్ కింద కవితను అరెస్ట్ చేశారు. కవిత అరెస్ట్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. రాజకీయ కుట్రలో భాగంగానే కవితను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందంటున్నారు.

పార్లమెంట్ ఎన్నికల వేళ.. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్, బీజేపీ కుట్రలు పన్నాయని ఆరోపణలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ ఆరోపణలను బీజేపీ నేతలు కొట్టిపడేశారు. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం కానీ, కుట్ర కోణం లేదంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. నేరం చేయనప్పుడు భయం ఎందుకు? అని ఎదురుదాడికి దిగారు కమలనాథులు.

అసలు.. ఎన్నికల వేళ కవిత అరెస్ట్ అంశాన్ని ఎలా చూడాలి? దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందా? కవిత అరెస్ట్ తో ఏం జరగబోతోంది? రాజకీయంగా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? కవిత అరెస్ట్ వ్యవహారంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ..

Also Read : కవిత అరెస్ట్.. తర్వాత ఏం జరగనుంది? సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రియాక్షన్

 

ట్రెండింగ్ వార్తలు