అమరావతిలో చంద్రబాబు గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనకు నిరసనలు వెల్లువెత్తాయి. ఉద్రిక్తమైన పరిస్థితుల మధ్య పర్యటన జరుగుతుంది. రెండు వర్గాలుగా విడిపోయిన రైతుల నుంచి కొన్ని యాంటీ ప్లెక్సీలు దర్శనమిచ్చాయి. పోటాపోటీగా ‘చంద్రబాబు గో బ్యాక్’ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు వెంకటపాలెం దగ్గర టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. 

‘చంద్రబాబు రాజధాని పేరుతో రంగురంగుల గ్రాఫిక్స్‌ చూపించి మమ్మల్ని ఎందుకు మోసం చేశారు. రాజధాని పేరుతో మీరు చేసిన మోసానికి రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలి. రాజధాని రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే చంద్రబాబు రాజధానిలో అడుగుపెట్టాలి.

కాగా కొందరు వ్యక్తులు చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాన్వాయ్ పై చెప్పులు, రాళ్లు విసిరారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. గురువారం(నవంబర్ 28,2019) చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు వెంట టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.