Rahul Gandhi: 113 సార్లు భద్రతా నియమాల్ని ఉల్లంఘించిన రాహుల్.. కాంగ్రెస్ ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సమాధానం

ఈ విషయమై ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఇందులో.. ‘‘యాత్రలో పెరుగుతున్న జనాన్ని నియంత్రించడంలో, జెడ్ ప్లస్ భద్రతను కేటాయించిన రాహుల్ గాంధీకి సరైన భద్రత కల్పించడంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఢిల్లీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు’’ అని ఆరోపించారు

Rahul Gandhi: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పలు భద్రతా లోపాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పందించింది. వాస్తవానికి రాహులే భద్రతా నియమాల్ని ఉల్లంఘించారని, సీఆర్‭పీఎఫ్ నిబంధనలను ఆయన 113 సార్లు ఉల్లఘించినట్లు గురువారం హోంశాఖ తెలిపింది. కాంగ్రెస్ యాత్ర ఢిల్లీలో ప్రవేశించడానికి రెండు రోజుల ముందు డిసెంబర్ 22న అన్ని ముందస్తు సెక్యూరిటీ లైజన్ (ఏఎస్ఎల్) నిర్వహించి భద్రతా మార్గదర్శకాలు ఏర్పాటు చేశామని, తగినంత భద్రతా సిబ్బందిని సైతం మోహరించినట్లు సీఆర్‭పీఎఫ్ తెలిపింది.

Sharad Pawar: కేంద్రం ఏం చేస్తుందో చెప్పడానికి అవే ఉదాహరణలు.. ఎన్సీపీ చీఫ్ పవార్

అయితే అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీయే నిర్దేశిత మార్గదర్శకాలను ఉల్లంఘించారని, ఈ విషయాన్ని ఆయనకు ఎప్పటికప్పుడు తెలియజేశామని సిఆర్‌పిఎఫ్ పేర్కొంది. వాస్తవానికి ఈ యాత్రలో అనేక భద్రతా లోపాలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీకి మరింత పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ బుధవారం డిమాండ్ చేసింది.

BJP vs Gandhi Family: ఆ ఘనత గాంధీ కుటుంబానికే దక్కుతుంది.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బీజేపీ

ఈ విషయమై ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఇందులో.. ‘‘యాత్రలో పెరుగుతున్న జనాన్ని నియంత్రించడంలో, జెడ్ ప్లస్ భద్రతను కేటాయించిన రాహుల్ గాంధీకి సరైన భద్రత కల్పించడంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఢిల్లీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు’’ అని ఆరోపించారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయాణించే మార్గంతో పాటు యాత్రకు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాల్సిందని చెప్పారు. అయితే ఢిల్లీ పోలీసులు మాత్రం మూగ ప్రేక్షకులుగా మిగిలిపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు