BJP vs Gandhi Family: ఆ ఘనత గాంధీ కుటుంబానికే దక్కుతుంది.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బీజేపీ
భారత దేశంలో అత్యంత అవినీతిపరుల కుటుంబం గాంధీ కుటుంబం. అవినీతికి పాల్పడటం, భూములు కబ్జా చేయడం, వాటిని రాబర్ట్ వాద్రాకు అప్పగించడం మాత్రమే ఆ కుటుంబం చేసే పని. ఆ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు అవినీతి కేసుల్లో బెయిలుపై బయట ఉన్నారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించని ప్రభుత్వానికి ఇది చాలా తీవ్రంగా తయారైంది. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలతోపాటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది.

Gandhi family 'most corrupt' in Indian politics, says BJP
BJP vs Gandhi Family: భారత రాజకీయాల్లో గాంధీ కుటుంబమే అత్యంత అవినీతిపరుల కుటుంబమని భారతీయ జనతా పార్టీ దుయ్యబట్టింది. మనీలాండరింగ్ కేసులో తనపై దర్యాప్తును రద్దు చేయాలని రాబర్ట్ వాద్రా చేసిన దరఖాస్తును రాజస్థాన్ హైకోర్టు తిరస్కరించిన అనంతరం బీజేపీ ఈ విధంగా వ్యాఖ్యానించింది. అయితే రాబర్డ్ వెంటబడుతున్నారని కాంగ్రెస్ చేసిన ఆరోపణలు బీజేపీ తోసి పుచ్చింది. వాద్రా దరఖాస్తును న్యాయస్థానం తిరస్కరించిన విషయాన్ని మర్చిపోవద్దంటూ చురకలు అంటించింది.
Maha vs Karnataka: ముంబై ఎవడి బాబు సొత్తు కాదు, అదెప్పటికీ మహారాష్ట్రదే.. డిప్యూటీ సీఎం ఫడ్నవీస్
ఈ విషయమై బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ.. “భారత దేశంలో అత్యంత అవినీతిపరుల కుటుంబం గాంధీ కుటుంబం. అవినీతికి పాల్పడటం, భూములు కబ్జా చేయడం, వాటిని రాబర్ట్ వాద్రాకు అప్పగించడం మాత్రమే ఆ కుటుంబం చేసే పని. ఆ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు అవినీతి కేసుల్లో బెయిలుపై బయట ఉన్నారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించని ప్రభుత్వానికి ఇది చాలా తీవ్రంగా తయారైంది. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలతోపాటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. రాబర్ట్ వాద్రాపై వచ్చిన అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మౌనం వీడాలి’’ అని అన్నారు.