Rahul told me that says Gehlot on congress chief election
Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ దూరంగా ఉన్న రాహుల్.. ఈ ఎన్నికలో గాంధీ కుటుంబం పోటీ చేయదని రాహుల్ గాంధీ తనతో చెప్పారని రాజస్తాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక అభ్యర్థి అశోక్ గెహ్లోత్ శుక్రవారం స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్‌ను రెండు రోజుల క్రితం గెహ్లోత్ కలిశారు. ఈ సందర్భంలో మాట్లాడినప్పుడు రాహుల్ ఈ విషయాన్ని తనతో చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.
‘‘కాంగ్రెస్ అధ్యక్ష పదవి తీసుకొమ్మని రాహుల్‌ను పలుమార్లు విజ్ణప్తి చేశాను. పార్టీలోని అందరి కోరిక ఇదేనని చెప్పాను. కానీ ఆయన అందుకు ఒప్పుకోలేదు. అధ్యక్ష పదవికి తాను దూరంగా ఉండదల్చుకున్నానని చెప్పారు’’ అని రాహుల్‌తో జరిగిన సంభాషణ గురించి గెహ్లోత్ చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘వాళ్లంతా నేను అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నారని నాకు తెలుసు. అయితే ఒక కారణం వల్ల ఆ పదవికి నేను దూరంగా ఉండదల్చుకున్నాను. నేనే కాదు, గాంధీ కుటుంబమై దూరంగా ఉంటుంది’’ అని రాహుల్ తనతో అన్నారట.
24 ఏళ్ల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. 1998లో ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పగ్గాలు చేపట్టిన అనంతరం నాటి నుంచి ఈ ఎన్నిక జరగలేదు. 2017లో రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడు చేసినప్పటికీ.. ఎలాంటి ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా జరిగిపోయింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియానే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 30 వరకు నామినేషన్లకు గడువు ఇచ్చారు. అనంతరం అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి.
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ సమస్య పరిష్కారం మోదీతోనే.. ఐక్య రాజ్య సమితిలో మెక్సికో ప్రతిపాదన