Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ సమస్య పరిష్కారం మోదీతోనే.. ఐక్య రాజ్య సమితిలో మెక్సికో ప్రతిపాదన
అమెరికా, చైనా అధినేతలను కాకుండా భారత అధినేతను మెక్సికో ప్రతిపాదించడం గమనార్హం. తాజాగా ఐక్య రాజ్య సమితిలో మెక్సికో విదేశాంగ మంత్రి మర్సెలో లూయిస్ ఎబ్రార్డ్ కసౌబోన్ మాట్లాడుతూ శాంతిని సాధించేందుకు అంతర్జాతీయ సమాజం తన శక్తి సమార్థ్యాలన్నిటినీ వినియోగించాలన్నారు. మానవ సంబంధాలను శాసించవలసింద శాంతియుత సంబంధాలే కానీ హింసాత్మక సంబంధాలు కాదని అన్నారు

Only PM Modi can mediate between Ukraine and Russia says Mexico at UN
Russia-Ukraine War: కొద్ది నెలలుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అయితే ఈ సమస్య భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతోనే పరిష్కారం అవుతుందని తాజాగా మెక్సికో ప్రతిపాదించింది. వాస్తవానికి మెక్సికో చెప్పిందేంటంటే.. రష్యా-ఉక్రెయిన్ మధ్య సామరస్య వాతావరణం నెలకొల్పడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పోప్ ఫ్రాన్సిస్, ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌లను నియమించాలని ఐక్య రాజ్య సమితికి సూచించింది.
అయితే ఈ కమిటీలో మోదీ మినహా మిగతా ఇద్దరూ దేశాధినేతలు కాదు. అమెరికా, చైనా అధినేతలను కాదని భారత అధినేతను మెక్సికో ప్రతిపాదించడం గమనార్హం. తాజాగా ఐక్య రాజ్య సమితిలో మెక్సికో విదేశాంగ మంత్రి మర్సెలో లూయిస్ ఎబ్రార్డ్ కసౌబోన్ మాట్లాడుతూ శాంతిని సాధించేందుకు అంతర్జాతీయ సమాజం తన శక్తి సమార్థ్యాలన్నిటినీ వినియోగించాలన్నారు. మానవ సంబంధాలను శాసించవలసింద శాంతియుత సంబంధాలే కానీ హింసాత్మక సంబంధాలు కాదని అన్నారు.
ఇక మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ ఓబ్రాడార్ చేసిన ప్రతిపాదనను ఐక్య రాజ్య సమితి ముందుంచారు ఎబ్రార్డ్. ఈ ప్రతిపాదనను ఐరాసా ముందు ఎబ్రాడ్ ప్రవేశపెడుతూ ‘‘రష్యా-ఉక్రెయిన్ మధ్య శాశ్వత ప్రాతిపదికన శాంతిని ఏర్పాటు చేయాల్సిన అసవరం ఉంది. ఇరు దేశాల మధ్య వైరాన్ని తగ్గించి సామరస్య వాతారవణం నెలకొల్పేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. నరేంద్ర మోదీ, పోప్ ఫ్రాన్సిస్, ఆంటోనియో గుటెరస్‌లను ఈ కమిటీలో నియమించాలి’’ అని ఎడ్రాడ్ అన్నారు.
కొద్ది రోజుల క్రితం ఉజ్బెకిస్తాన్‌లోని సమరఖండ్‌లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ కాసేపు చర్చించారు. ఈ సదర్భంగా ఇది యుద్ధ సమయం కాదని పుతిన్‌తో మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఫెర్టిలైజర్లు, ఇంధన భద్రతా సమస్యలు ఉన్నాయని, ముందు వాటిపై శ్రద్ధ వహించాలని సూచించారు.
Amit shah slams nitish kumar: ఇలాగైతే నితీశ్ బాబు దేశ ప్రధాని ఎలా కాగలరు?: అమిత్ షా