నీ తాత సొమ్ము అడగటం లేదు : మోడీపై దివ్యవాణి వీరావేశం

  • Publish Date - February 11, 2019 / 06:59 AM IST

ఢిల్లీ :  ఏపీ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్నతీరుకు నిరసనగా సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ లోని ఏపీ భవన్ లో చేపట్టిన దీక్షకు పలు రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది.  వైసీపీ నాయకులు ఇచ్చిన  బిర్యానీలకు , డబ్బులకు ఆశపడి ఆదివారం గుంటూరులో జరిగిన బీజేపీ సభకు జనాలు వచ్చారని  టీడీపీ నేత, ఒకప్పటి హీరోయిన్ దివ్యవాణి చెప్పారు. మోడీ పెద్ద అవినీతి పరుడని ఆరోపించారు. గతంలో నేషనల్ ఫ్రంట్ టైంలో ఎన్టీఆర్ ప్రభంజనం చూసి ఇందిరాగాంధే  వణికిపోయారని ఆమె అన్నారు.  

ఆదివారం గుంటూరులో జరిగిన సభలో  మోడీ చంద్రబాబును వెన్నుపోటుదారు అనటం పై ఆమె అభ్యంతరం తెలుపుతూ ….” కొంత మంది హరికధలు బుర్రకధలు చెప్పుకునే వారు నందమూరి తారక రామారావు గారి ఒంటరితనాన్ని ఆసరాగా  చేసుకుని , కుటుంబాన్ని రోడ్డు మీద హరికధలుగా, బుర్ర కధలుగా చేస్తుంటే  అల్లుడుగా, కొడుకుగా నందమూరి వంశాన్ని  ఒడ్డున నిలబెట్టిన చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత మీకు లేదని ఆమె ఆవేశంగా అన్నారు.  లోకేష్ తండ్రి చంద్రబాబు అని మోడీ చేసిన వ్యాఖ్యలపై కూడా దివ్యవాణి మాట్లాడుతూ ” కుటుంబం గురించి నువ్వేం మాట్లాడతావు, గొడ్డు మోతోడివి నీకేం తెలుసు ప్రేమల యొక్క విలువ ” అని ఆమె అన్నారు.