సమత కేసు..న్యాయం జరిగేనా..తీర్పుపై ఉత్కంఠ

  • Publish Date - January 27, 2020 / 01:16 AM IST

దిశ కేసు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది సమత హత్య, అత్యాచారం కేసు. కోర్టు తన తీర్పును 2020, జనవరి 27వ తేదీ సోమవారం నాడు వెలువరించనుంది. ఇప్పటికే ఈ కేసులో ఆదిలాబాద్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ పూర్తి అయ్యింది. రికార్డు సమయంలో కేసు విచారణను పూర్తి చేసింది.  నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

దిశ ఘటన జరిగిన సమయంలో సమత అత్యాచారాని గురైంది. 
ముగ్గురు నిందితులు ఆమెపై అత్యాచారం జరిపి… ఆపై గొంతుకోసి హత్య చేశారు.
మరుసటి రోజు ఈ హత్యోదంతం బయటకు వచ్చింది.

అత్యంత ఘోరంగా సమతపై అత్యాచారం జరిపి.. హత్య చేసిన నిందితులను వదిలిపెట్టవద్దంటున్నారు. నిందితులను దోషులుగా ప్రకటించి… కఠిన శిక్ష వేయాలని కోరుతున్నారు. ఇలాంటి నేరగాళ్లకు కఠిన శిక్షలు పడకుంటే మహిళలు, యువతులపై దాడులు అరికట్టలేమని చెబుతున్నారు. భవిష్యత్‌లో లైంగిక దాడులకు అడ్డుకట్టపడాలంటే సమత హత్య కేసు నిందులకు కఠిన శిక్షలు పడాలని కోరుతున్నారు.

సమత హత్యపై నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేసింది.
నిందితులను, సాక్షులను విచారించింది. 
ఈ విచారణ కూడా వేగంగా పూర్తయ్యింది. 

మరోవైపు నిందితుల కుటుంబ సభ్యులు కూడా తమవారు తప్పుచేస్తే శిక్షించాలని కోరుతున్నారు. ఒకవేళ తప్పు చేయకుంటే విడిచిపెట్టాలని అభ్యర్థిస్తున్నారు. కోర్టు తీర్పు కోసం తామూ ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. 

తీర్పు కోసం సమత కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
నిందితులకు  న్యాయస్థానం ఎలాంటి శిక్ష విధించబోతోందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read More : హాజీపూర్ జడ్జిమెంట్ టైమ్ : ఉరి శిక్ష విధిస్తారా