SC Asks Eknath Shinde Camp To Prove Political Majority Over Legal Majority
Sena vs Sena: ఎనిమిది నెలల ఉత్కంఠ అనంతరం శివసేన పార్టీకి ఏక్నాథ్ షిండే వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో షిండే వర్గం ఊపిరి పీల్చుకుంది. నిజానికి ఉద్ధవ్ థాకరే వర్గంతో పోటీ పడి పార్టీని దక్కించుకోవడాన్ని పెద్ద విజయంగానే భావించింది. ఇక గొడవ ముగిసిందని ఊపిరి పీల్చుకున్న షిండే వర్గానికి సుప్రీంకోర్టు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. చూపించుకోవాల్సింది ఎమ్మెల్యేల మద్దతు కాదు, రాజకీయ మద్దతు ఎంత ఉందో చూపించుకోవాలంటూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో షిండే వర్గంలో అలజడి మొదలైంది.
LPG Cylinder Price: సామాన్యులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
వాస్తవనానికి ఈసీఐ ఆదేశం ఇచ్చిన అనంతరమే.. ఈ విషయంపై ఉద్ధవ్ థాకరే సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా సుప్రీంకోర్టులో షిండే అర్జీ పెట్టుకున్నారు. అయినప్పటికీ ఉద్ధవ్ వేసిన పిటిషనును సుప్రీం స్వీకరించి విచారించింది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి సంబంధించిన ఈ వ్యాజ్యాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ ఎంఆర్ షా, కృష్ణ మురారి, హిమ కోహ్లీ, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా షిండే తరపు న్యాయవాదికి ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.
Kim Jong Un: ఉత్తరకొరియాలో ఆకలి చావులు .. మిలటరీ గొప్పల్లో మునిగితేలుతున్న కిమ్..!
న్యాయస్థానం షిండే క్యాంప్‌ను వివిధ సమస్యలపైచ, వివిధ తీర్పులలోని చట్టపరమైన అంశాలపై అనేక ప్రశ్నలు అడిగింది. ఫిరాయింపులు, ఫ్లోర్ టెస్ట్‌లను ఎలా వేరు చేయాలో తెలుసుకోవాలని కోరింది. ఒకవేళ ఫ్లోర్ టెస్ట్‌కు ముందస్తు కారణం పదో షెడ్యూల్‌ను ఉల్లంఘించినట్లు అయితే, ఆ దశలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించడం వల్ల పదో షెడ్యూల్ యొక్క మొత్తం ప్రాతిపదిక, ఉద్దేశ్యం దెబ్బతింటుందని సీజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. పదో షెడ్యూల్ ప్రకారం అనుమతి లేని ఫిరాయింపులను చట్టబద్ధం చేస్తున్నారా లేదా అని కూడా కోర్టు ప్రశ్నించింది.
Gurugram: రోడ్డు మీద పూలకుండీలు దొంగిలించిన కియా కారు ఓనర్ మీద కేసు నమోదు
ఇక కోర్టు ప్రశ్నలకు షిండే తరపు న్యాయవాది ఎన్‌కె కౌల్ స్పందిస్తూ తదుపరి విచారణలో ఈ సమస్యను ప్రస్తావిస్తామని చెప్పారు. ఇంకా కేసు పదో షెడ్యూల్ ప్రకారం విభజించబడలేదని, వారు పార్టీలో అసమ్మతి, ప్రత్యర్థి వర్గం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యం ప్రకారమే పార్టీ గుర్తింపు లభించిందని, తమ పార్టీ శివసేన అని సుప్రీంకోర్టుకు ఆయన పేర్కొన్నారు.