Subramanian Swamy: కేంద్ర హోంమంత్రిగా అమిత్ షాకు అర్హత లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి

సోమవారం ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ ‘‘భారత భూభాగంలోకి ఎవరైనా అతిక్రమించగలిగే కాలం గడిచిపోయింది. ఇప్పుడు ఎవరూ దాని సరిహద్దు వైపు చూసే సాహసం చేయలేరు’’ అని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దు గ్రామమైన కిబిథూలో వైబ్రంట్ విలేజెస్ కార్యక్రమాన్ని అమిత్ షా ప్రారంభించారు

Subramanian Swamy: కొంత కాలంగా మోదీ ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ సీనియర్ ఎంపీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా అర్హుడు కాదని ఆయన మంగళవారం అన్నారు. ఈయన తరుచూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలను టార్గెట్ చేస్తున్నారు. అందులో భాగంగానే తాజా విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. సరిహద్దు విషయమై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఆయన ఈ విమర్శలు చేశారు.

Cow Urine: గోమూత్రం మనుషులకు హానికరం.. ఐవీఆర్ఐ పరిశోధనలో వెల్లడి

‘‘భారత సరిహద్దులు సురక్షితమైనవి, ఉల్లంఘించలేం’ అని అమిత్ షా పేర్కొంటూ టుడేస్ ది హిందూ హెడ్‌లైన్స్ పేర్కొన్నారు. ఇది పచ్చి అబద్ధం, అతని హిమాలయమంతటి అజ్ఞానం. అందుకే ఆయన హోంమంత్రిగా అర్హుడు కారు. చట్టవిరుద్ధమైన ద్వంద్వ పౌరసత్వంపై పని చేయడం మంచిది’’ అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు.

Luizinho Faleiro: దీదీకి షాకిచ్చిన గోవా మాజీ సీఎం.. టీఎంసీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా

దీనికి ముందు సోమవారం ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ ‘‘భారత భూభాగంలోకి ఎవరైనా అతిక్రమించగలిగే కాలం గడిచిపోయింది. ఇప్పుడు ఎవరూ దాని సరిహద్దు వైపు చూసే సాహసం చేయలేరు’’ అని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దు గ్రామమైన కిబిథూలో వైబ్రంట్ విలేజెస్ కార్యక్రమాన్ని అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సైన్యం, ఐటీబీపీ సిబ్బంది శౌర్యం భారతదేశ భూమిలో ఒక్క అంగుళాన్ని కూడా ఎవరూ ఆక్రమించలేరని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు