కరోనాతో కన్ను మూసిన మంత్రి దొరైక్కన్ను

  • Publish Date - November 1, 2020 / 03:06 PM IST

Minister Doraikkannu passes away : కరోనా వైరస్ సోకి తమిళనాడుకు చెందిన మంత్రి కన్నుమూశారు. వ్యవసాయ శాఖ మంత్రి దొరైక్కన్ను(72) శ్వాసకోస ఇబ్బందులతో ఆక్టోబర్ 13 చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు.



ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ ఇతర ఆనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది.



ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం దొరైక్కన్ను తుది శ్వాస విడిచారు. ఈమేరకు ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటన విడుదల చేశారు.