జగన్ పార్టీలోకి వెళ్లినోళ్లంతా వెనక్కు వస్తారు : బోండా ఉమా 

  • Publish Date - November 22, 2019 / 08:12 AM IST

టీడీపీ లోని ఒకరిద్దరు పనికిరానివాళ్లు మాత్రమే వైసీపీ లోకి చేరారని…మా పార్టీ నుండి వేరే పార్టీకి వెళ్ళడానికి ఎవరు సిద్ధంగా లేరని టీడీపీ నాయకుడు బోండా  ఉమా మహేశ్వర రావు అన్నారు. ఇప్పుడు జగన్ పచ్చగా ఉన్నారు అని అందరూ అక్కడికి వెళ్తున్నారు…రేపు అక్కడ చెట్టు ఎండటం మొదలు పెడితే సొంత ఇంటికి వచ్చాము అని ఇక్కడికి చేరతారు…రెండు సీట్లు ఉన్న బీజేపీ నేడు ఈ స్థాయికి రాలేదా? అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులను ముందు సమాయత్తం చేసి ఆ తర్వాత ఇంగ్లీష్ భాషను తీసుకువస్తే మాకు ఏమి అభ్యంతరం లేదని బోండా ఉమా చెప్పారు. టీడీపీ పై వైసీపీ నాయకులు దుష్ప్రచారం ప్రచారం చేస్తున్నరని…ఇంగ్లీష్ భాషను మేమే రాష్ట్రానికి పరిచయం చేస్తున్నట్లు సీఎం మాట్లాడుతున్నారని అన్నారు. 

భాషను కూడా రాజకీయాలకు వాడుకుంటున్న పార్టీ వైసీపీ అని ఆయన ఆరోపించారు. 2016 లో నీతి ఆయోగ్ విద్యా వ్యవ్యస్తలో ఏపీ నెంబర్ 1 అని రిపోర్ట్ ఇచ్చింది. టీడీపీ హయాంలో తెలుగుకు తూట్లు అని ఆనాడు జగన్ మాపై విమర్శలు చేసారు.మాతృ భాషకు బాబు మంగళం పాడారు అని జగన్ ఊరు ఊరు తిరిగి ప్రచారం చేశారని బోండా ఉమా విమర్శించారు.