టీడీపీ అభ్యర్ధుల జాబితాపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

మీడియాపై ఎవరో నాయకులే చేయించిన దాడి ఇది. ఫ్యాక్షనిస్టులు కూడా అలా కొట్టరు. అంత దారుణంగా కొట్టారు.

JC Prabhakar Reddy : టీడీపీ అభ్యర్ధుల జాబితాపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అభ్యర్ధుల లిస్ట్ అంతా రెడీగా ఉందన్నారాయన. బీజేపీతో రెండు, మూడు రోజుల్లో పొత్తు ఖరారయ్యే అవకాశం ఉండడం వల్ల లిస్ట్ కొంత ఆలస్యమవుతోందన్నారు. ఇంకా వైసీపీలోనే టికెట్లు కన్ఫర్మ్ కాలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీలో.. అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి అక్కడికి మారుస్తున్నారని చెప్పారు. టికెట్ వస్తే చాలు గెలిచిపోతాం అన్న భ్రమలో వైసీపీ నాయకులు ఉన్నారని విమర్శించారు.

”రాప్తాడు సిద్ధం సభలో మీడియాపై దాడిని ఖండిస్తున్నా. మీడియాకే రక్షణ లేదు. మామూలు వ్యక్తుల పరిస్థితి ఏంటి? మీడియాపై ఎవరో నాయకులే చేయించిన దాడి ఇది. ఫ్యాక్షనిస్టులు కూడా అలా కొట్టరు. అంత దారుణంగా కొట్టారు. జేసీ ఫ్యామిలీకీ ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని అడిగాం. మాకు ఒక్క టిక్కెట్ ఇచ్చినా పార్టీ కోసం పని చేస్తాం” అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Also Read : కూటమితో ఇన్ని కష్టాలా? టీడీపీ నేతలకు తలనొప్పిగా మారిన పొత్తులు..!

ట్రెండింగ్ వార్తలు