సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

  • Publish Date - March 16, 2020 / 09:22 AM IST

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక తీర్మానానికి తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది.  సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభంకాగానే సీఏఏపై తీర్మానం ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్‌ చర్చను ప్రారంభించారు.

రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై విస్తృతంగా చర్చ జరిగింది. దేశ ప్రజల్ని కుల, మత ప్రతిపాదికన విభజించే సీఏఏపై కేంద్ర ప్రభుత్వం పున: సమీక్ష చేయాలని అన్నారు. దేశం కోట్ల మంది జనన ధ్రువీకరణ పత్రాలు లేవన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ అనంతరం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

సీఏఏఐపై తీర్మానానికి కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు కూడా మద్దతిచ్చాయి. తీర్మానం ఆమోదం తర్వాత స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి భోజన విరామం ప్రకటించారు. దేశంలో ఏడు రాష్ట్రాలు.. కేరళ, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయని కేసీఆర్ గుర్తు చేశారు.

ఇందులో తమది ఎనిమిదో రాష్ట్రమని కేసీఆర్ చెప్పారు. సీఏఏను తాము గుడ్డిగా వ్యతిరేకించడం లేదని, అన్నీ అర్థం చేసుకొని పూర్తిగా ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. 

Also Read | టీడీపీకి మరో షాక్ : వైసీపీలోకి శిద్ధా రాఘవరావు!