×
Ad

Governor Quota MLCs : మళ్లీ వారిద్దరే..! గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో కేబినెట్ కీలక నిర్ణయం

గతంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే, గవర్నర్ తమిళిసై దాన్ని తిరస్కరించారు.

  • Published On : March 12, 2024 / 05:54 PM IST

Governor Quota MLCs : ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ని రేవంత్ ప్రభుత్వం మళ్లీ నామినేట్ చేసింది. వారిద్దరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. ఈ తీర్మానాన్ని రాజ్ భవన్ కు పంపనుంది ప్రభుత్వం. గతంలోనే ఇద్దరినీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయగా.. పున: పరిశీలించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ నామినేట్ చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

గతంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే, గవర్నర్ తమిళిసై దాన్ని తిరస్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ లను నామినేట్ చేసింది కేబినెట్. దీనిపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. పున:పరిశీలించాలని సూచించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మరోసారి కోదండరాం, అమీర్ అలీ ఖాన్ లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది క్యాబినెట్.

Also Read : కావాలనే అలా కూర్చున్నా, నేను ఎవరికీ తలవంచే వాడిని కాదు- ప్రతిపక్షాల ట్రోల్స్‌కు డిప్యూటీ సీఎం భట్టి రిప్లయ్