పోతిరెడ్డిపాడుపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తా : సీఎం కేసీఆర్

  • Publish Date - May 18, 2020 / 03:52 PM IST

పోతిరెడ్డిపాడుపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని….ఉమ్మడి రాష్ట్రంలో కేటాయింపుల మేరకే ప్రాజెక్ట్‌లు కట్టుకున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. సోమవారం రాత్రి ప్రగతి భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన నీటి వాటాలపై మాకు స్పష్టమైన అవగాహన ఉందని.. మాకున్న వాటా మేరకు నీళ్లను వాడుకుంటున్నామని చెప్పారు. 

గోదావరి మిగులు జలాలు ఎవరు వాడుకున్నా అభ్యంతరం లేదని తెలంగాణ ప్రజలకు భంగం కలిగితే మాత్రం ఊరుకునేది లేదన్నారు. రాయలసీమ గోదావరి మిగులు జలాలు వాడుకోవచ్చన్నారు. కృష్ణా జలాల విషయంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదన్నారు. 

చట్టం పరిధిలో మా ప్రజలకు న్యాయం చేస్తామని సీఎం చెప్పారు. బాబ్లీపై పంచాయతీ పెట్టి ఏం సాధించారన్నారు. పోతిరెడ్డి పాడు గురించి ఎవరు కొట్లాడారో ప్రజలకు తెలుసని వివాదాలకు పోకుండా సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు.