చనిపోయిన కార్మిక కుటుంబసభ్యులకు రూ. 2 లక్షలు

  • Publish Date - December 1, 2019 / 12:20 PM IST

ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ వరాలు జల్లు కురిపించారు. సమ్మె కాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందన్నారు. అంతేగాకుండా ప్రభుత్వం తరపున రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. సెప్టెంబర్ నెల జీతం, సమ్మె కాలానికి సంబంధించిన జీతాన్ని చెల్లిస్తామన్నారు. ఒకేసారి కాకుండా..కొద్ది మొత్తంలో చెల్లించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడేది ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. ఆర్టీసీ బాగు చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతోందన్నారు. డిసెంబర్ 01వ తేదీ ఆదివారం ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ లంచ్ చేసి సంస్థపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆయన కార్మికులనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు వెలువరించారు. 

ఐదు నిమిషాల్లో ఓ నిర్ణయం తీసుకుంటే..ఎంతో మంది కార్మికులు రోడ్డున పడే వారన్నారు. ఐదు వేల పర్మిట్లు ఇస్తే..ఆర్టీసీ ఖతమై అయిపోయి ఉండేదన్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టమే ఇందుకు కారణమన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి..సార్..అని ఆర్టీసీ అధికారులు చెప్పారని తెలిపారు. అందుకే మరలా కార్మికులు విధుల్లోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఎవరో చెప్పిన మాటలకు మోసపోకుండా..సంస్థను కాపాడుకోవాలని సూచించారు. 

> సెప్టెంబర్ నెల జీతాన్ని డిసెంబర్ 02వ తేదీ సోమవారం ఉదయం వారి వారి ఖాతాల్లో వేస్తామన్నారు. 
> 55 రోజుల సమ్మె కాలానికి సంబంధించిన జీతం ఇస్తాం. ఇందులో ఎలాంటి కోతలు ఉండవు. ఇంక్రిమెంట్ కూడా పోదు. 
> చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి పక్కాగా ఉద్యోగం ఇవ్వాల్సిందే. ప్రభుత్వ పరంగా రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇప్పించే ఏర్పాటు. 
Read More : ఆర్టీసీ కార్మికులకు మరో గుడ్ న్యూస్ : సమ్మె కాలంలో జీతాలు ఇస్తాం- కేసీఆర్