తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర హోం మంత్రి మహమ్మూద్ ఆలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మహమ్మూద్ ఆలీ గత కొద్ది రోజులుగా కోరనా లక్షణాలతో ఇబ్బంది పడుతుండటంతో ఆయనకు కరోనా టెస్టులు నిర్వహించారు.
పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో ఆయన ఆదివారం రాత్రి అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ సోకగా వారంతా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వీరు కాక బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతలరామచంద్రా రెడ్డి కూడా కరోనా బారిన పడి చికిత్స పొంది క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు వీహెచ్, గూడురు నారాయణ రెడ్డిలు కూడా కరోనా బారిన పడ్డారు.
జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేరిన హోం మంత్రి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. హైదరాబాద్ లో పెరుగుతున్నకరోనా కేసులపై సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్సి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం పర్యటిస్తోంది. బుధవారం జరిగే క్యాబినెట్ భేటీలో హైదరాబాద్ లో తిరిగి లాక్ డౌన్ విధించే అంశంపై ఒకనిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇప్పిటికే జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసుల సంఖ్య11 వేలకు దాటింది. వీరిలో 4వేల మంది ఇప్పటికే చికిత్సపొంది ఇంటికి చేరుకుంటే మరో 7 వేల యాక్టివ్ కేసులున్నాయి.నిన్నమొత్తం 983 కోరనా కేసులు వస్తే 816 జీహెచ్ఎంసీ పరిఘధిలోనే ఉన్నాయి. హైదరాబాద్ మిగతా జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ పరిసరాలలోనే కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి.