బీజేపీ ఓట్లు వైసీపీకి పడ్డాయి.. అందుకే జగన్ సీఎం అయ్యారు

ఏపీ సీఎం జగన్, ప్రధాని మోడీని కలవడంతో వైసీపీ, బీజేపీ కలుస్తాయని.. పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో ఏకంగా జగన్ పార్టీ

  • Publish Date - February 15, 2020 / 01:36 PM IST

ఏపీ సీఎం జగన్, ప్రధాని మోడీని కలవడంతో వైసీపీ, బీజేపీ కలుస్తాయని.. పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో ఏకంగా జగన్ పార్టీ

ఏపీ సీఎం జగన్, ప్రధాని మోడీని కలవడంతో వైసీపీ, బీజేపీ కలుస్తాయని.. పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో ఏకంగా జగన్ పార్టీ చేరుతుందని ప్రచారం జరుగుతోంది. అందుకే సీఎం జగన్ ప్రధాని మోడీ, అమిత్ షా లను కలిశారనే టాక్ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలో వైసీపీతో దోస్తీ, పొత్తు గురించి బీజేపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. జగన్ మాకు రాజకీయ ప్రత్యర్థే.. వైసీపీతో ఎలాంటి పొత్తు ఉండదని.. బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దేవ్ ధర్ తేల్చి చెప్పారు.

తాజాగా ఇదే అంశంపై ఏపీ బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవ్ ధర్ కు భిన్నంగా మాట్లాడారు. జగన్ తో పొత్తు ఉండదని దేవ్ ధర్ తేల్చి చెబితే.. టీజీ వెంకటేష్ మాత్రం.. అందుకు భిన్నంగా రియాక్ట్ అయ్యారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అన్నారు. బీజేపీ, వైసీపీ కలయిక అనేది పైస్థాయిలో నిర్ణయిస్తారని చెప్పారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎన్డీయేలో చేరే అంశం గురించి పరిశీలిస్తామని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై టీజీ స్పందించారు. జగన్ నుంచి సంకేతాలు వచ్చి ఉంటాయని, అందుకే పొత్తు గురించి బొత్స అలా మాట్లాడి ఉంటారని టీజీ అన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ పరోక్ష సహకారంతోనే వైసీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని టీజీ చెప్పారు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని.. ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని టీజీ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీతో సీఎం జగన్ కలవచ్చేమో అని టీజీ అనుమానం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు