BJP National Vice President Jay Panda Received Threat Call: భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు జై పాండాకు హత్య బెదిరింపులు వచ్చాయి. ఆయనను ఒడిశా మాజీ మంత్రి నబా దాస్ ని చంపేసినట్లే చంపేస్తామని అగంతులకు ఫొన్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఏడాది జనవరిలో అప్పటి ఒడిశా మంత్రి నబా దాస్‌ను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. భాజపా జాతీయ ఉపాధ్యక్షుడి సహాయకుడికి బెదిరింపు కాల్ వచ్చిందని, అందులో నబా దాస్‌కు చేసినట్లే జై పాండాకు కూడా చేస్తానని కాలర్ బెదిరించినట్లు బుధవారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఘటనకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఢిల్లీ పోలీసులకు అందించారు.
FIR on Himanta Biswa Sarma: సోనియా గాంధీపై విధ్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ అస్సాం సీఎంపై కేసు నమోదు
జై పాండా 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలోని కేంద్రపరా స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2000 నుంచి 2009 వరకు రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు. జనవరి 2018లో, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై జై పాండాను పార్టీ నుంచి బిజూ జనతాదళ్ బహిష్కరించింది. నాలుగు నెలల తర్వాత ఆయన బీజేడీకి రాజీనామా చేశారు. అనంతరం 2019 మార్చి 4న బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన నాలుగు రోజులకే ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. జై పాండా మిచిగాన్ టెక్నలాజికల్ యూనివర్శిటీ నుంచి కమ్యూనికేషన్‌లో ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ చదివారు.