AP మూడు రాజధానులపై మంత్రి KTR ట్వీట్

  • Publish Date - December 29, 2019 / 01:28 PM IST

ఏపీలో మూడు రాజధానుల విషయంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలివిగా సమాధానం చెప్పారు. ఇప్పటికే ఏపీలో ఈ అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. గత 12 రోజులుగా అమరావతిలో రైతులు ఆందోళనలు, నిరసనలు హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే..2019, డిసెంబర్ 29వ తేదీ మంత్రి కేటీఆర్ #AskKTR పేరిట ట్విట్టర్ వేదిగాక నెటిజన్ల ముందుకు వచ్చారు.

వారు అడిగిన ప్రశ్నలకు టకటక సమాధానం చేప్పేస్తున్నారు. అందులో ఓ నెటిజన్ మూడు రాజధానుల అంశంపై ప్రశ్నించారు. అంతేగాకుండా…ఆరు నెలల సీఎం జగన్ పాలనపై స్పందించాలని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. బాగానే ప్రారంభించాడని అనుకుంటున్నట్లు తెలిపారు. యు ఆర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులపై మీ అభిప్రాయం ఏంటీ ? రాజధాని, హైకోర్టు ఇవేనా అభివృద్ధి అంటూ ప్రశ్నించారు. దీనికి మంత్రి కేటీఆరన్ చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. అది నిర్ణయించేది తాను కాదు..ఏపీ ప్రజలు అంటూ ట్వీట్ ద్వారా ఆన్సర్ ఇచ్చారు. 

Read More : బస్తీ మే సవాల్ : పురపోరుకు TRS సై..క్లీన్ స్వీప్ లక్ష్యం
ఇంకా ఇతర అంశాలపై కూడా ఆయన స్పందించారు. 

ప్రస్తుత రాజకీయాల్లో ఎవరు మీకు స్పూర్తి అని అడిగితే..మరో ఆలోచన లేదు..KCR అంటూ చెప్పారు. 
ఆర్థిక సంక్షోభం, కులం – మతం రాజకీయాలు, పేదరికి ఏది భారత్ ‌కు అసలైన సవాల్ అంటే..రాజకీయాలను – ఆర్థిక వ్యవస్థలను బ్యాలెన్స్ చేయడం సవాల్ అన్నారు. 
LB Nagar ఫ్లై ఓవర్ ఎప్పటికి పూర్తవుతుందని అంటే..ఇప్పటికే ఒకటి పూర్తయ్యింది..మిగతా మూడు త్వరలోనే పూర్తయితాయన్నారు. 
ఇలా ఎన్నింటికో ఆయన సమాధానం ఇచ్చారు.