జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ ఆంక్షలు

  • Publish Date - February 26, 2020 / 01:14 PM IST

జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మూడు నెలల పాటు ఇవి అమల్లో ఉండనున్నాయి. ఎందుకంటే దుర్గం చెరువు రూట్‌లో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండడమే కారణం. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ప్రకటన విడుదల చేశారు. 

* రోడ్డు నెంబర్ 45 జూబ్లిహిల్స్ నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మీదుగా వెళ్లే వాహనాలు రోడ్డ్ నెంబర్ 52, రోడ్డు నెంబర్ 46 మార్గం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 
* రోడ్డు నెంబర్ 49 నుంచి వచ్చే వాహనాలు..రోడ్డు నెంబర్ 45 మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 
* 20 – 05 – 2020 వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. 

అలాగే..రూట్‌లో చేపట్టాల్సిన చర్యలపై ట్రాఫిక్ సిబ్బందికి ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ శిఖా గోయల్ పలు సూచనలు చేశారు. 
 

* ట్రాఫిక్ నియంత్రణకు ప్రైవేటు సెక్యూర్టీ సిబ్బంది సహకరించాలి. పెద్ద ఎత్తున సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి. రేడియం బోర్డులు ఏర్పాటు చేయాలి. 
* ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి. 
* పనులు జరుగుతున్న ప్రదేశంలో లైట్లు ఏర్పాటు చేయాలి. సరైన భద్రతా చర్యలు చేపట్టాలి. 
* R & B మార్గదర్శకాల ప్రకారం నిర్మాణాలు జరగాల్సి ఉంటుంది. 
* పనులు ముగిసిన అనంతరం రీ కార్పెంటింగ్ పనులు త్వరగా పూర్తి కావాలి.