Rahul Gandhi: గెడ్డం గీసుకుని, సూట్ వేసుకుని కొత్త లుక్‭లో ఆశ్చర్యపరిచిన రాహుల్ గాంధీ

సెప్టెంబరు 2022లో తమిళనాడులోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించినప్పటి నుంచి జనవరి 30న జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగిసే వరకు రాహుల్ గాంధీ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ యాత్ర సందర్భంగా ఆయన నెరసిన గెడ్డంతో కనిపించారు. ఇప్పుడు గెడ్డాలు, మీసాలు, తల కత్తిరించుకున్నారు

Rahul Gandhi: భారత్ జోడో యాత్రం ప్రారంభంలో చిన్నపాటి గెడ్డం, తెల్లని టీ-షర్టుతో కనిపించిన రాహుల్.. యాత్ర ముగిసేనాటికి పొడవాటి గెడ్డంతో మొత్తంగా అవతారమే మార్చేశారు. రాహుల్ అవతారంపై కాంగ్రెస్ మద్దతుదారులు ‘రుషి’ అంటూ పొగడ్తలు కురిపించారు. చాలా రోజులుగా ఇలాగే కనిపించిన ఆయన.. ఉన్నట్టుండి గెడప్ మార్చేశారు. ట్రిమ్మింగ్ చేసిన గెడ్డం, చిన్నపాటి హేర్ కట్.. ఇక వీటిని మించి సూట్‭ వేసుకుని కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా దృఢంగా, శక్తిమంతంగా కనిపించారని, ఇప్పుడు ఆయన నగిషీ చెక్కిన శిల్పంలా నాజూకుగా ఉన్నారని ఆయన అభిమానులు సంబరపడుతున్నారు. అంతే కాకుండా రాహుల్ మోడ్రన్ పొలిటీషియన్ అంటూ ప్రసంసలు కురిపిస్తున్నారు.

విషయం ఏంటంటే.. వారం రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్ చేరుకున్నారు రాహుల్. ఈ నెల 5న లండన్‌లోని భారతీయ ప్రవాసులతో సంభాషించనున్నారు. అనంతరం లండన్‌లోని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) సభ్యులతో కూడా సమావేశమవుతారు. ఐఓసీ అనేది కాంగ్రెస్ పార్టీకి విదేశీ విభాగం. ఇక వ్యాపార సంఘ సభ్యులతో కూడా రాహుల్ సంప్రదింపులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Kim Jong Un: ఉత్తరకొరియాలో ఆకలి చావులు .. మిలటరీ గొప్పల్లో మునిగితేలుతున్న కిమ్..!

సెప్టెంబరు 2022లో తమిళనాడులోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించినప్పటి నుంచి జనవరి 30న జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగిసే వరకు రాహుల్ గాంధీ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ యాత్ర సందర్భంగా ఆయన నెరసిన గెడ్డంతో కనిపించారు. ఇప్పుడు గెడ్డాలు, మీసాలు, తల కత్తిరించుకున్నారు. తెలుపు రంగులోని టీ-షర్ట్‌తో కాకుండా సూటు, టై ధరించారు. ఈ కొత్త అవతారంలో ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 21వ శతాబ్దంలో వినడాన్ని నేర్చుకోవడం అనే అంశంపై ప్రసంగిస్తారని ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఇచ్చిన ట్వీట్‌లో తెలిపింది. ఈ ఫొటోలను కాంగ్రెస్ నేతలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో తెలుపు రంగు టీ-షర్ట్ ధరించిన సంగతి తెలిసిందే. ఐదు నెలలపాటు దట్టమైన గెడ్డాలు, మీసాలతో ఆయన దర్శనమిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు