Black Protest: కాంగ్రెస్ పార్టీ నిరసనలో సడెన్ ఎంట్రీ ఇచ్చిన తృణమూల్ కాంగ్రెస్

మా నిరసనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందుకే నిన్న కూడా కృతజ్ణతలు తెలిపాను, ఈరోజు కూడా చెబుతున్నాను. ప్రజా సంక్షేమం, భద్రత మా ధ్యేయం. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి ఎవరు ముందుకు వచ్చినా మేము స్వాగతిస్తాం. అలాగే ప్రజల నుంచి మాకు వస్తున్న మద్దతుకు కూడా ప్రత్యేక కృతజ్ణతలు తెలుపుతున్నాను

Black Protest: భారతీయ జనతా పార్టీకి ఎంత దూరమో, కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే దూరాన్ని మెంటైన్ చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనకు మద్దతు తెలపడమే కాకుండా, వారితో నిరసనలో పాల్గొంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు సహా అదానీ గ్రూప్ వ్యవహారంలో జేపీసీని డిమాండ్ చేస్తూ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో పార్లమెంటు ముందు కాంగ్రెస్ ఎంపీలు సోమవారం నిరసన చేపట్టారు. నలుపు దుస్తులు, నలుపు జెండాలతో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలోనే టీఎంసీ ఎంపీలు పాల్గొన్నారు.

Uttar Pradesh: యూపీలో దారుణం..10ఏళ్ల బాలుడ్ని నరబలి ఇచ్చిన బంధువు.. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు..

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఫ్రంట్ ఏర్పాట్లలో ఉన్న మమతా బెనర్జీ.. కాంగ్రెస్ పార్టీ లేకుండా ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనికి అనుగుణంగా కొంతకాలంగా హస్తం పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ నిరసనలో చేరడమే కాకుండా, దానికి ముందు టీఎంసీ ఎంపీలు ప్రసున్ బెనర్జీ, జవహార్ సిర్చార్‭లు మల్లికార్జున ఖర్గేతో స్ట్రాటజీ మీటింగులో పాల్గొనడం గమనార్హం. కాగా, ఈ విషయమై సిర్చార్ మాట్లాడుతూ ‘‘మొదటి రోజు నుంచి జరుగుతున్న ప్రతి నిరసనలో ప్రతి వాక్ ఔట్లో మేము పాల్లొంటూ వస్తున్నాము. కలిసి నడవడం అనేది కొన్నిసార్లు అవసరం. అప్రజాస్వామ్య విధానాలపై పోరాడేవారికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది’’ అని అన్నారు.

Minister KTR: భారతదేశం చూస్తోంది..! బీజేపీపై ట్విటర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డ కేటీఆర్, కవిత ..

ఇక కాంగ్రెస్ చీఫ్ ఖర్గే స్పందిస్తూ ‘‘మా నిరసనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందుకే నిన్న కూడా కృతజ్ణతలు తెలిపాను, ఈరోజు కూడా చెబుతున్నాను. ప్రజా సంక్షేమం, భద్రత మా ధ్యేయం. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి ఎవరు ముందుకు వచ్చినా మేము స్వాగతిస్తాం. అలాగే ప్రజల నుంచి మాకు వస్తున్న మద్దతుకు కూడా ప్రత్యేక కృతజ్ణతలు తెలుపుతున్నాను’’ అని అన్నారు. ఇక తెలంగాణలో విపక్షాలుగా ఉన్న భారత్ రాష్ట్ర సమితి ఎంపీలు సైతం ఈ నిరసనలో పాల్గొనడం గమనార్హం. ఈ నిరసనలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సైతం పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు