బీజేపీలోకి వెళ్లను, జీవితాంతం కేసీఆర్ కి రుణపడి ఉంటా : ఎమ్మెల్యే క్లారిటీ

మొన్న జోగు రామన్న, నిన్న జూపల్లి, నేడు షకీల్.. ఇలా రోజుకో టీఆర్ఎస్ లీడర్ పై పార్టీ మారుతున్నట్టు వార్తలు రావడం.. వారు క్లారిటీ ఇవ్వడం కామన్ అయ్యాయి. తాజాగా

  • Publish Date - September 13, 2019 / 07:18 AM IST

మొన్న జోగు రామన్న, నిన్న జూపల్లి, నేడు షకీల్.. ఇలా రోజుకో టీఆర్ఎస్ లీడర్ పై పార్టీ మారుతున్నట్టు వార్తలు రావడం.. వారు క్లారిటీ ఇవ్వడం కామన్ అయ్యాయి. తాజాగా

మొన్న జోగు రామన్న, నిన్న జూపల్లి, నేడు షకీల్.. ఇలా రోజుకో టీఆర్ఎస్ లీడర్ పై పార్టీ మారుతున్నట్టు వార్తలు రావడం.. వారు క్లారిటీ ఇవ్వడం కామన్ అయ్యాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత షకీల్ అహమ్మద్ కూడా ఆ జాబితాలోకి ఎక్కారు. పార్పీ మార్పు వార్తలపై ఆయన నోరు విప్పాల్సి వచ్చింది. తాను బీజేపీలోకి వెళ్లను, టీఆర్ఎస్ లోనే ఉంటాను అని క్లారిటీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ తనకు పొలిటికల్ గాడ్ ఫాదర్ అని, జీవితమంతా కేసీఆర్ కి రుణపడి ఉంటాను అని షకీల్ స్పష్టం చేశారు. బీజేపీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. సీఎం కేసీఆర్ తనకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. బతికున్నంత కాలం టీఆర్ఎస్ లోనే ఉంటాను అని తేల్చి చెప్పారు. మంత్రి పదవి దక్కనందుకే పార్టీ మారుతున్నారని వచ్చిన వార్తలను షకీల్ తోసిపుచ్చారు. తానసలు మంత్రి పదవి ఎప్పుడూ ఆశించలేదన్నారు. కేసీఆర్ ఆశీర్వాదం వల్లే రెండుసార్లు ఎమ్మెల్యే కాగలిగానని చెప్పుకొచ్చారు.

టీఆర్ఎస్ ను వదిలేది లేదు అంటూనే షకీల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ను కలవడాన్ని సమర్థించుకున్నారు. అందులో ఎలాంటి తప్పు లేదన్నారు. జిల్లాలో కలిసి పని చెయ్యడం కోసమే అరవింద్ ను కలిశాను అని వివరించారు. అవసరమైతే మళ్లీ వెళ్లి బీజేపీ ఎంపీని కలుస్తాను అని చెప్పి హీట్ పెంచారు.

ఇటీవలే సీఎం కేసీఆర్ కేబినెట్ ను విస్తరించారు. మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ ముఖ్య నేతలు టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా మారిపోతున్నారు. కేసీఆర్ మాట తప్పారని నాయిని నరసింహారెడ్డి, కేబినెట్‌లో మాదిగలకు చోటివ్వలేదని మరో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. జోగు రామన్న కూడా అసంతృప్తికి లోనయ్యారు. ఎమ్మెల్యే షకీల్ సైతం మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తికి గురయ్యారని వార్తలు వచ్చాయి.  టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రాగానే మైనార్టీ కోటాలో మంత్రి పదవి దక్కుతుందని ఆశించిన షకీల్.. పదవి దక్కకపోయేసరికి హర్ట్ అయ్యారని, టీఆర్ఎస్ ను వీడాలని నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కలిశారని టాక్ నడిచింది. దీనిపై రచ్చ జరగడంతో షకీల్ స్పందించారు. తాను టీఆర్ఎస్ లోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు.