సీఎం కేసీఆర్ చాలా మంచి అవకాశాలు ఇచ్చారని, ఎన్నో వరాలు కురిపించారని ఆర్టీసీ కార్మికులు అన్నారు. ఆర్టీసీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజన్నారు. ఆర్టీసీని నిలబెట్టేందుకు..తాము తప్పకుండా కష్టపడి పనిచేస్తామన్నారు. సమ్మె కాలానికి జీతాలు, మహిళా కార్మికులకు, పీఎఫ్ ఇతరత్రా బకాయిలు చెల్లించడం లాంటి నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. డిసెంబర్ 01వ తేదీ సోమవారం ప్రగతి భవన్‌లో ఆర్టీసీ కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం కేసీఆర్.
ఈ సందర్భంగా ఆర్టీసీ సంస్థ మనుగడ, తీసుకోవాలని చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. భేటీ అనంతరం సమావేశానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి 10tv కార్మికులతో మాట్లాడింది. ఏమీ అడగకుండా ముందే..అన్నీ చెప్పారని..సంతోషంగా ఉందన్నారు. కార్మిక సంఘాలు స్పందించిన దానికన్నా ఎక్కువగా సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారన్నారు. ఉద్యోగ భద్రత, సంస్థ లాభాల బాటలో తేవడం, తల్లిదండ్రులకు పాస్‌లు, రిటైర్ మెంట్ వయస్సు పెంచడం, బడ్జెట్‌లో నిధులు ఇతరత్రా వాటిపై సీఎం కేసీఆర్ చర్చించడం జరిగిందన్నారు.
మహిళలకు గౌరవంగా డ్రెస్ కోడ్, టాయిలెట్లు, ఉద్యోగ భద్రత తదితర వాటిపై హామీనిచ్చారని మహిళా కార్మికులు వెల్లడించారు. సమ్మెలో ఎంతో బాధ పడిన తాము..ఇప్పుడు సంతోషంగా ఉన్నామన్నారు. సమ్మె చేసి పొరపాటు చేశామన్నారు. తామంతా ఆర్టీసీని అభివృద్ధి బాటలో తేవడానికి తామంతా కృషి చేస్తామని అన్నారు ఆర్టీసీ కార్మికులు.
Read More : ఆర్టీసీలో ప్రైవేటుకు నో ఛాన్స్ : యూనియన్ ఉండదు – సీఎం కేసీఆర్