టీడీపీ నుంచి పార్లమెంటుకు వంగవీటి రాధ?

  • Publish Date - March 5, 2019 / 03:58 PM IST

వైసీపీని వీడిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా వారసుడు వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరతారా లేదా అనే అంశంపై సస్పెన్స్ వీడట్లేదు. వైసీపీకి గుడ్ బై చెప్పిన వంగవీటి రాధాతో టీడీపీలో నేతలు చర్చలు జరపడంతో ఆయన టీడీపీలోకి వెళ్లడం లాంఛనమే అని అంతా అనుకున్న సమయంలో రాధా టీడీపీలో చేరడంపై రంగా అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, అందుకే ఆయన టీడీపీలోకి వెళ్లట్లేదంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వంగవీటి రాధ విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ని కలవడం ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. తనను ఇబ్బంది పెట్టిన వైసీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా వంగవీటి రాధ పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. 
ఇందులో భాగంగానే లగడపాటిని వంగవీటి రాధ కలిసినట్లు తెలుస్తుంది. అంతకుముందే  గుంటూరులో లగడపాటి రాజగోపాల్ స్పీకర్ కోడెలతో చర్చలు జరిపారు.  టీడీపీలో చేరకుండానే వైసీపీని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ఉన్నారని వార్తలు వచ్చిన క్రమంలో ఆయన టీడీపీ నుంచే నేరుగా పోటీ చేయాలని భావిస్తున్నారట. అనకాపల్లి, ఉభయగోదావరి జిల్లాలలో ఏదో ఒక చోట నుండి పోటీ చేసే ఉద్దేశ్యంతో వంగవీటి రాధ ఉన్నట్లు సమాచారం. విజయవాడ సెంట్రల్ నుండి పోటీ చేయాలని ముందు నుంచి భావించిన రాధ అక్కడ నుండి బోండా ఉమకు టీడీపీ నుండి సీటు కన్ఫామ్ కావడంతో వేరే చోట ప్రయత్నించే ఉద్దేశ్యంతో ఉన్నారు.