గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో గుంటూరు జిల్లా, పల్నాడు ప్రాంతంలోని టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుకను, సున్నపురాయిని దోచుకున్నారని ఆరోపించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్టారెడ్డి. వైసీపీ కార్యకర్తలను బెదిరించి హింసించి భయ బ్రాంతలుకు గురిచేసి వారి ఆస్తులను కూడా దోచుకుని, వారిపై దాడులు చేసారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవాళ చంద్రబాబు నాయుడు తానేదో ఉధ్ధరించినట్లు మాట్లాడుతున్నారని…. గ్రామాల్లో సాధారణంగా జరిగే చిన్ని చిన్న గొడవలను భూతద్దంలో చూపించి పెయిడ్ ఆర్టిస్టులతో పునవారాస కేంద్రాలు పెట్టారని అన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుపై సీబీఐ ఎంక్వైరీ ఎందుకు వెయ్యలేదని న్యాయస్ధానాలు ప్రశ్నించే స్ధాయిలో అరాచకాలు చేశారని తెలిపారు. కాదేది అవినీతికి అనర్హం అనే స్దాయిలో కోడెల కుటుంబం పల్నాడులో అరాచకాలు చేశాయని వాటినుంచి ప్రజల దృష్టిని మరల్చటానికే చంద్రబాబు ఈ కార్యక్రమం చేప్టటారని అన్నారు.
ప్రజలు రేషన్ అడిగితే కొట్టారు, పెన్షన్ అడిగితే కొట్టారని వాళ్లలిస్టు చూపిస్తామని ఆళ్ల తెలిపారు. పల్నాడులోని ఫ్యాక్షన్ ఏరియాలో జగన్ ప్రభు్త్వం అధికారంలోకి వచ్చాక అందరూ ఫ్యాక్షన్ వదిలి పొలం పనులకు వెళ్లటం, వ్యాపారం చేసుకోవటం చేస్తున్నారని అన్నారు.