గులాబీ సీట్లు, కారు గుర్తుతో YSR కాంగ్రెస్ ప్రచార వాహనాలు

నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెప్ పార్టీ ఎన్నికల ప్రచార రథాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

  • Published By: veegamteam ,Published On : March 13, 2019 / 10:10 AM IST
గులాబీ సీట్లు, కారు గుర్తుతో YSR కాంగ్రెస్ ప్రచార వాహనాలు

నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెప్ పార్టీ ఎన్నికల ప్రచార రథాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెప్ పార్టీ ఎన్నికల ప్రచార రథాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం ఆ పార్టీ సిద్ధం చేసుకున్న జిప్సీలోని సీట్లు టీఆర్ఎస్ జెండా రంగు, కారు గుర్తుతో ఉండటం ఆసక్తిరేకెత్తిస్తోంది. గులాబీ సీట్లు, కారు గుర్తుతో ఉన్న AP 24 TC 4823 నెంబర్ గల వాహనం నగరంలోని నిప్పో సెంటర్ లో కనిపించడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Read Also : నారా Vs నార్నే నిజమేనా : లోకేష్ ను ఢీ కొట్టేది ఎవరు

వైఎస్సార్ కాంగ్రెప్ పార్టీ ప్రచార రథంలోని సీట్లు టీఆర్ఎస్ జెండా రంగు, కారు గుర్తుతో ఉండటమేంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఉపయోగించిన వాహనాలకే రీస్టిక్కరింగ్ చేసి.. వైసీపీ నాయకులు వాడుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Read Also : ఇది కన్ఫామ్ : మంగళగిరి నుంచే లోకేష్ పోటీ